Dogs Hostel: ఏసీ గదులు.. చికెన్‌తో ఆహారం.. రోజుకు 1200 అద్దె.. మనుషులకు కాదండోయ్.. శునకాల కోసం ప్రత్యేక హాస్టల్..!
ABN, First Publish Date - 2023-06-20T16:24:54+05:30
వేసవి కాలం కావడంతో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సెలవులను బట్టి టూర్లు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొంత మంది ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉంటాయి.
వేసవి కాలం (Summer) కావడంతో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రల (Tours)కు వెళ్లాలనుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సెలవులను బట్టి టూర్లు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొంత మంది ఇళ్లలో పెంపుడు కుక్కలు (Pet Dogs) ఉంటాయి. వారం, పది రోజుల పాటు టూర్లు వెళితే ఆ కుక్కల ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ ఉండరు. తాము విహార యాత్రలో ఉన్న సమయంలో వాటిని ఎక్కడ ఉంచాలనేది పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఛండీగఢ్ (Chandigarh) వాసులకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది.
ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డాగ్ హాస్టల్స్ (Dog Hostels) వెలుస్తున్నాయి. వాటిల్లో పెంపుడు కుక్కలను వదిలేసి నిశ్చింతగా టూర్లకు వెళ్లి రావొచ్చు. అక్కడ కుక్కలకు అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. పెంపుడు జంతువు బాధ్యతను తీసుకునే ముందు హాస్టల్ నిర్వాహకులు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుంటారు. అది ఏమి తింటుంది, ఎంత సమయం తిరుగుతుంది వంటి వివరాలను యజమాని నుంచి తీసుకుంటారు. అంతేకాదు ప్రతిరోజూ వీడియో కాల్స్ చేసి కుక్కలను యజమానులకు చూపిస్తారు.
Temple: ఆ గుడిలో అరుదైన ఘటన.. 35 మంది ఉద్యోగులు.. 11 రోజులుగా కట్టలకొద్దీ డబ్బును లెక్కిస్తూనే ఉన్నారు..!
ఈ డాగ్ హాస్టల్స్‌కు రోజుల లెక్కన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాళ్లు అందించే సౌకర్యాలను బట్టి ఫీజు ఉంటుంది. కుక్కకు రోజూ ఉదయం, సాయంత్రం చికెన్, ఏసీ గది, సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు గ్రౌండ్ వంటి సౌకర్యాలు కావాలంటే రోజుకు రూ.1400 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అవేమీ అక్కర్లేకుండా సాధారణ భోజనం, వసతి సరిపోతుందనుకుంటే రోజుకు రూ.400 అవుతుంది. ఛండీగఢ్ చుట్టుపక్కల ఇలాంటి డాగ్ హాస్టల్స్ చాలా ఉన్నాయి.
Updated Date - 2023-06-20T16:24:54+05:30 IST