90 ఏళ్ల వయసులో ఘాటు ప్రేమ.. తన ఆస్థిని లవర్‌కు రాసిచ్చేశాడు.. చివరకు భార్య ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే..
ABN, First Publish Date - 2023-01-11T19:07:56+05:30
ఆ వ్యక్తి వయసు 90 ఏళ్లు..ఆ వయసులో ఎవరైనా కృష్ణా, రామ అంటూ కాలం వెల్లదీస్తుంటారు.. అయితే తమిళనాడులోని (Tamil Nadu) సేలం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మాత్రం లేటు వయసులో ఘాటు ప్రేమకు తెరతీశాడు.. 65 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు.. అంతేకాదు ఆమెకు తన ఆస్థిని రాసిచ్చేశాడు
ఆ వ్యక్తి వయసు 90 ఏళ్లు..ఆ వయసులో ఎవరైనా కృష్ణా, రామా అంటూ కాలం వెల్లదీస్తుంటారు.. అయితే తమిళనాడులోని (Tamil Nadu) సేలం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మాత్రం లేటు వయసులో ఘాటు ప్రేమకు తెరతీశాడు.. 65 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు.. అంతేకాదు ఆమెకు తన ఆస్థిని రాసిచ్చేశాడు (90 Years Old Man Wrote his property to girl friend).. దీంతో అతడి భార్య కలెక్టర్‌ను కలిసి భర్త తీరుపై ఫిర్యాదు చేసింది.. తన పిల్లలకు రావాల్సిన వాటా ఇప్పించాలని లేదా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొంది.
సేలం జిల్లా పెరియవడాగపట్టికి చెందిన పళనియప్పన్ అనే (90) అనే వృద్ధుడికి భార్య పొన్నమ్మల్ (82), కొడుకు, కూతురు ఉన్నారు. 70 ఏళ్ల వయసులో కొడుకు ఇటీవలె మరణించాడు. పళనియప్పన్ కొద్ది రోజులుగా కుప్పాయి (65) అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య, కూతురు ఎంతగా చెబుతున్నా వినకుండా లక్షలు విలువ చేసే తన 6.5 ఎకరాల భూమిని ప్రేయసి పేరున రాసేశాడు. అదేమిటని అడిగితే ఇల్లు కూడా లాగేసుకుంటానని భార్యను, కూతురిని బెదిరించాడు. దీంతో చేసేది లేక పొన్నమ్మల్ తన కూతురితో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసింది.
82 ఏళ్ల వయసులో కూడా కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నానని, తన భర్త వివాహేతర సంబంధాన్ని అరికట్టి ఆస్థిని తిరిగి ఇప్పించాలని వేడుకుంది. అలా చేయలేని పక్షంలో తనకు కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని అడిగింది. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.
Updated Date - 2023-01-11T19:07:57+05:30 IST