ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి వెళ్లిన వారందరికీ షాక్.. భోజనం చేసి కల్యాణ మండపంలోకి రాగానే కలకలం.. చివరకు..

ABN, First Publish Date - 2023-02-26T15:49:31+05:30

కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది.. అతిథులందరూ ఎంతో ఉత్సాహంగా భోజనాలకు వెళ్లారు.. భోజనాలు చేసి వచ్చి వివాహ వేదిక ముందు కూర్చున్నారు.. ఇంతలో అక్కడ కలకలం మొదలైంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది.. అతిథులందరూ ఎంతో ఉత్సాహంగా భోజనాలకు వెళ్లారు.. భోజనాలు చేసి వచ్చి వివాహ వేదిక ముందు కూర్చున్నారు.. ఇంతలో అక్కడ కలకలం మొదలైంది.. ఏకంగా 43 మంది కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.. అందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. పెళ్లి భోజనాలలో ఓ ఐటెమ్ ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) కావడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఖర్గోన్ నగరంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో (Wedding Ceremony) అపశ్రుతి చోటు చేసుకుంది. ఆ వివాహంలో భోజనం చేసిన 43 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. భోజన సమయంలో వారంతా పాలు, సీతాఫలంతో కలిపి చేసిన కస్టర్డ్ (Fruit Custard) తిన్నారు. అర్దరాత్రి వారంతా వాంతులు, విరేచనాలతో బాధప్డారు. వారిని వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. వారందరికీ డాక్టర్లు సెలైన్ ఎక్కించారు. వారిలో చాలా మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.

Updated Date - 2023-02-26T15:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising