ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఒమాన్‌లో శోభాయమానంగా శోభకృత్ ఉగాది వేడుకలు

ABN, First Publish Date - 2023-04-03T17:22:33+05:30

ఎడారి దేశాలలో ఇతర దేశాలతో పోల్చితే తెలుగు వారి ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు ఆచార వ్యవహారాలను ప్రస్పుటంగా ప్రతిబింబించే ఒమాన్‌లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలో ఇతర దేశాలతో పోల్చితే తెలుగు వారి ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు ఆచార వ్యవహారాలను ప్రస్పుటంగా ప్రతిబింబించే ఒమాన్‌లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.

సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలను శనివారం ఒమాన్‌లోని భారతీయ రాయబారి అమిత్ నారంగ్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వేడుకలు జరిగిన మస్కట్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ అచ్చం తెలుగు నేలను మరిపించింది. శ్లోకాల పఠనం నుండి మొదలు కవిత్వం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల వరకు వైవిధ్యభరితంగా ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో నూతన వసంతం విరబూసినట్లయ్యింది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రవాసంలో కూడా సజీవంగా ఉంచడమే కాకుండా చురుక్కుగా చేస్తున్నందుకు ఒమాన్ తెలంగాణ సమితిను భారతీయ రాయబారి ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రాంతీయతో సంబంధం లేకుండా ఉగాది, సంక్రాంతి మొదలగు పండుగలన్నీ తెలుగు వారి పండుగలని ఒమాన్ తెలంగాణ సమితి కన్వీనర్ గుండేటి గణేశ్ పెర్కోన్నారు.

ఆకాశంలో సగం కాదు ఎక్కువే అంటూ, పరుషుల కంటే దీటుగా మాధవి రాజిరెడ్డి తన ప్రసంగం, ఆ తర్వాత చేసిన కవిత పఠనం ద్వారా తన ప్రత్యేకతను చాటారు.

శ్రీ లత అధ్వర్యంలో జరిగిన శ్లోకాల పఠన కార్యక్రమంలో మోహిత్ అల్లంకు, వి. హర్షవర్ధన్, వైష్ణవ్ శర్మ, హేమ కృషవ్, యం. మేధాంశ్, సాన్వి బల్లా, యశ్రీ బల్లా మరియు గీతీషా సభికులను అశ్చర్యపర్చారు. చిత్ర కళలలలో దేవి అల్లంకు, అరుశ్ సాయి, తన్మయ ప్రభ, విహాస్ బి, జి. మమత, రాణి ప్రభ, వైష్ణవి గన్నరం, సంధ్య మంగ తమ ప్రతిభను కనబరిచారు. మౌనిక అధ్వర్యంలో జరిగిన మహిళల నృత్య కార్యక్రమంలో అశ్రిత, రాధా, అరుణ, అపూర్వ, మానస, సంధ్య, లతలు ఆహ్లాదకర వాతావరణంలో వినసొంపైన సంగీతానికి కనువిందు చేసే రీతిలో నృత్య ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. సమృతహా సన్య, పుష్యామి, సాన్వీలు కూడ వివిధ ఆంశాలపై ప్రసంగాలు చేసారు.

సునిత చంద్ర అధ్వర్యంలో జరిగిన స్కటింగ్ కార్యక్రంలో సునీత, చరణ్, రేవతి, యజ్ఞన్ దేవ్, సాయి రాహుల్ పల్లి, శృతి, పున్న రాణిలు పాల్గోన్నారు. అరుణ వూతలూరు కూడ కవిత్వాన్ని చదివారు. సౌనిక అధ్వర్యంలో జిరిగన చిన్నారుల నృత్య కార్యక్రమంలో మేధాంశ్, మానస్విని, మనోమ్యశ్రీ పాల్గోనగా నాజీయా నేతృత్వంలో జరిగిన నూనే వైష్ణవి, వివేక్ నూనే, వైష్ణవి శర్మ, రిషీక్ గుండేటి, సాయి సోమేత్, రోషన్, రిత్విక్, జశ్వంత్, చరణ్ కాజ, వైష్వీక్ రెడ్డి, బాసితలు తన విన్యాసాలను ప్రదర్శించారు. ఇక సంధ్య గుడేటి అధ్వర్యంలో జరిగిన న్యత్యాలలో సంధ్య, రుచిత చిలుకమరిలు సభికులపై తమదైన ముద్ర వేసారు.

వేడుక నిర్వహణ, ఏర్పాట్లను బుక్క శ్రీనివాస్, గణేశ్ గుండేటి, నూనే లక్ష్మణ్ యాదవ్, రవి సుంకరి, థమ్మశెట్టి రమేష్, శైలజ, అహ్మద్, మంచికట్ల కుమార్, రాజేందర్ రెడ్డి, మేడిశేట్టి అమరేందర్, సాదుల రవి, బ్రహ్మనంది శంకర్, రవి యాదవ్, బల్లా శ్రీనివాస్, నాజీయా బేగం, అరుణ వుతలూరు, రాధికలు పర్వవేక్షించారు.

కులమత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా తెలుగు వారందర్ని కలుపుకొంటూ అందరి సమన్వయంతో ఒమాన్ తెలంగాణ సమితి ఒమాన్ లో పని చేస్తుందని గుండేటి గణేష్, బుక్క శ్రీనివాస్ లు పెర్కోన్నారు.

Updated Date - 2023-04-03T17:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising