ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: విమానంలో తల్లి కోరడంతో బాలికకు దుప్పటి ఇచ్చిన ఎన్నారై కటకటాలపాలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 06:03 PM

సౌదీ అరేబియాలోని రియాధ్ నుండి హైదరాబాద్‌కు శ్రీలంక మీదుగా ట్రాన్సిస్ట్‌లో వెళ్తుండగా మార్గమధ్యంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే అభియోగంపై తెలంగాణ ప్రవాసీని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు.

  • శ్రీలంక జైలులో గల్ఫ్ ప్రవాసీ

  • నిష్పాక్షిక విచారణకై దళిత ప్రవాసీ అభ్యర్ధన

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తాను విమానంలో ఏ రకమైన అసభ్యకర ప్రవర్తనకు పాల్పడలేదని, విమానంలో చలిని తట్టుకోలేకపోతున్న తన కూతురు కంటే కూడా చాలా చిన్నదైన పాపను అమె తల్లి కోరిక మేరకు పైన క్యాబిన్ నుండి దుప్పటి తీసి కప్పానని శ్రీలంక పోలీసుల అదుపులో ఉన్న తెలంగాణ ప్రవాసీయుడు పెర్కోన్నాడు.

​సౌదీ అరేబియాలోని రియాధ్ నుండి హైదరాబాద్‌కు శ్రీలంక మీదుగా ట్రాన్సిస్ట్‌లో వస్తుండగా మార్గమధ్యంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే అభియోగంపై తెలంగాణ ప్రవాసీని శ్రీలంక పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా జగిత్యాల మండలానికి చెందిన 49 ఏళ్ళ ప్రవాసీ విమానంలో మొదటి వరుసలో కూర్చుని ఉన్న తనను క్యాబిన్ నుండి ఎయిర్‌లైన్సు ఇచ్చే దుప్పటిని తీసి ఇవ్వాల్సిందిగా బాలిక తల్లి కోరడంతో కాదనలేక మానవీయ కోణంలో తాను అంగీకరించి పైన క్యాబిన్ నుండి బ్లాంకెట్ తీసిచ్చానని చెప్పాడు. తల్లి కోరడంతోనే బాలికపై కప్పానని ఆ ప్రవాసీ తన కుటుంబానికి ఫోన్ చేసి వివరించాడు. తనకు ఉన్న ఇద్దరు కూతుళ్ళ కంటే కూడా తక్కువ వయస్సు ఉన్న బాలిక పట్ల గానీ అమె తల్లి పట్ల గానీ తనకు ఎలాంటి దురుద్దేశం లేదని అతను వివరణ ఇచ్చాడు.


దళితుడయిన తాను చాలా కాలంగా సౌదీ అరేబియాలో ఉంటున్నానని, మహిళల పట్ల ప్రవర్తన గురించి తనకు తెలుసని పైగా ఇద్దరు కూతుళ్ళు ఉన్న తాను ఏ విధంగా ఒక చిన్న బాలికను విమానంలో లైంగికంగా వేధిస్తానని ప్రశ్నించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీలంకలో పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షలలో కూడా తన గురించి ఎలాంటి తప్పుడు నివేదికలు రాలేదని, ఇతర ప్రయాణికులు కూడా వాస్తవాలు వివరించారని తన భర్త చెప్పినట్లుగా ప్రవాసీ భార్య వెల్లడించింది.

​అచ్చిరాని కష్టం వచ్చి పడ్డ దళిత ప్రవాసీ కుటుంబానికి సౌదీ అరేబియాలోని సామాజిక కార్యకర్త అబ్దుల్ రఫీక్ అండగా నిలుస్తూ నిష్పాక్షిక విచారణ కోసం శ్రీలంకలోని భారతీయ హై కమీషన్‌ను సంప్రదించారు. ప్రముఖ ప్రవాసీయుడు పోలాస అక్బర్ సహాయంతో శ్రీలంకలో న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నట్లుగా రఫీక్ వెల్లడించారు.

Updated Date - Dec 26 , 2023 | 06:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising