ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: లండన్‌లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2023-03-13T19:12:50+05:30

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో సంస్థ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) మహిళా విభాగం ఆధ్వర్యంలో సంస్థ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టాక్ మహిళా విభాగం సభ్యులు కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ కవిత మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలని ప్రశంసించారు. తమ లాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, మహిళల హక్కుల కోసం పోరాటాం చేస్తున్న ధీర వనితని పేర్కొన్నారు. అలాంటి నాయకురాలి పైన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా తమ వెంటే ఉంటూ ప్రోత్సహిస్తున్న కవితక్క వెంట తామంతా ఉన్నామని స్పష్టం చేశారు. "వీ స్టాండ్ విత్ కవిత అక్క" ( #WeStandWithKavithaAkka ) అంటూ మహిళలంతా ఈ సందర్భంగా నినదించారు.

కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి సమస్యలొచ్చినా దైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తి గల ధీర వనిత అని కవితపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా మహిళ బిల్లు కోసం చేప్పట్టిన దీక్షకు ప్రవాసులంతా మద్దత్తు తెలుపుతున్నారని, తమ పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మహిళా బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి, మహిళా లోకానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తునట్టు సుప్రజ తెలిపారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్ట సభల్లో కూడా న్యాయమైన వాటా రావాలని సుప్రజ తెలిపారు. ‘‘కవితక్క.. మేమంతా మీ వెంట ఉన్నాం’’ అంటూ మద్దత్తు తెలిపారు. ఈ వేడుకల్లో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డితో పాటు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, పావని కడుదుల, క్రాంతి, స్నేహ,శ్వేతా, మౌనిక, నంతిని, మమతా, హారిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T19:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising