NRI: ఫిన్‌ల్యాండ్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలిగా శ్రీవల్లి అడబాల
ABN, First Publish Date - 2023-03-28T21:38:26+05:30
ఫిన్లాండ్‌లో తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధి కోసం స్థాపించిన 'ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీవల్లి అడబాల ఎన్నికయ్యారు.
ఫిన్లాండ్‌లో తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధి కోసం స్థాపించిన 'ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీవల్లి అడబాల ఎన్నికయ్యారు. 2015లో మొదలయిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఫిన్లాండ్‌లో వున్న తెలుగు వారికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ప్రపంచంలోనే ప్రజలు అత్యంత సంతోషంగా జీవించే దేశాలలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంటుంది.
ఈ దేశానికి ప్రధాన మంత్రి కూడా ఒక మహిళ. అలాగే మన ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కూడా మహిళ అధ్యక్షురాలు ఎన్నికవ్వడం గర్వకారణం. అలాగే.. ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ కంచెర్ల, కార్యదర్శిగా రోజా రమణి మొలుపోజు, కోశాధికారిగా లక్ష్మీ తులసి పునగంటి, తెలుగు మనబడి ప్రోగ్రాం సమన్వయకర్తగా గోపాల్ పెద్దింటి, కమిటీ సభ్యులుగా ప్రతాప్ కుమార్ గార, అభిలాష్ పెద్దింటి, గాయత్రి దశిక, కృష్ణ కొమండూరు, కిరణ్మయి గజ్జెల, రమణారెడ్డి కరుమూరు, సత్యసాయి బాబు పగడాల, సుభాష్ బొగాడి ఎన్నికయ్యారు.
ఈ కార్యవర్గం 25.03.2023 తేదిన ఉగాది, శ్రీరామనవమి సంబారాలని విజయవంతగా జరిపించింది. మున్ముందు మరిన్ని కార్యక్రమాలని జరుపుతామని, తెలుగు వారిని మరింత చేరువగా ఉంటామని అద్యక్షులు శ్రీవల్లి అడబాల పేర్కొన్నారు.
Updated Date - 2023-03-29T19:05:23+05:30 IST