NRI: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ‘శివ భక్తి గీతాలాపన’
ABN, First Publish Date - 2023-02-23T19:57:51+05:30
శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా "శివ భక్తి గీతాలాపన" ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమంలో శనివారం నిర్వహించారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా "శివ భక్తి గీతాలాపన" ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమంలో శనివారం నిర్వహించారు.
శ్రీ కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసి ఆప్యాయంగా ఆశీస్సులు అందించి, ఇటీవల శివైక్యం చెందిన ప్రముఖ నటిమణి జమునకు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు నివాళిగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాము" అని తెలియజేశారు. సింగపూర్లో నివసించే గాయనీ గాయకులు శివ భక్తి కీర్తనలను మధురంగా ఆలపించారు. వాటిలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, దయానంద సరస్వతి విరచిత కీర్తనలు, లలిత గీతాలు, సాగర సంగమం శంకరాభరణం వంటి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల నుండి, జమున నటించిన నాగులచవితి సినిమా నుండి కూడా పాటలు ఎంపిక చేసుకుని ఆలపించడం విశేషం.
రాధిక మంగిపూడి కార్యక్రమాన్ని నిర్వహించగా గాయనీ గాయకులుగా శైలజ చిలుకూరి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, శేషు కుమారి యడవల్లి, శేషశ్రీ వేదుల, రాధిక నడాదూర్, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, అనంత్ బొమ్మకంటి, ఉషా గాయత్రి నిష్ఠల, పద్మజ వేదుల, కిరీటి దేశిరాజు తదితరులు వివిధ శివ భక్తి సంకీర్తనలను మధురంగా ఆలపించారు.
రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారధ్యంలో యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.
Updated Date - 2023-02-23T20:14:23+05:30 IST