NRI TDP USA: జయరాం కోమటి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు!
ABN, First Publish Date - 2023-04-23T18:07:03+05:30
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర(ఎన్నారై ) టీడీపీ నేతల ఆధ్వర్యంలో సిలికాన్ వాలీలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ముఖ్య అతిథిగా తెలుగుదేశం నేత రవి మందలపు హాజరు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర(ఎన్నారై ) టీడీపీ నేతల ఆధ్వర్యంలో సిలికాన్ వాలీలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ, చంద్రబాబు 1998లో ముఖ్యమంత్రిగా సిలికాన్ వాలీలో పర్యటించిన విశేషాలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో తన అనుబంధాన్ని వివరించి, 2024లో మళ్లీ ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరాన్ని విశ్లేషించారు. చంద్రబాబు 100వ పుట్టినరోజు కూడా తన ఆధ్వర్యంలో జరిగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరు: రవి మందలాపు!
క్రమశిక్షణ పాటించే చాలా తక్కువ మంది అరుదైన నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ సీనియర్ నాయకుడు, చంద్రబాబుకు అత్యంత ఆత్మీయులలో ఒకరైన రవి మందలాపు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు స్థిత ప్రజ్ఞత ఉన్న నాయకుడన్నారు. ఎప్పుడు కలిసినా, ఆయన ఏదో ఒక విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేయడమో, వివరించే ప్రయత్నమో చేస్తారని చెప్పారు. ఏడాది తర్వాత, అధికారంలోకి రాగానే, వంటిల్లును కేంద్రంగా చేసుకుని అనారోగ్య సమస్యలకు చికిత్సలు రూపొందించే అద్భుత కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. గత నాలుగేళ్లలో ఒక విధ్వంసక పాలనను అందరం చూశామని, కానీ, ఏడాదిలోనే ఏపీలో అద్భుతమైన చంద్రబాబు పాలన ప్రారంభం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తెలుగుదేశం యువనేత రవి కిరణ్ మాట్లాడుతూ, చంద్రబాబు వంటి నాయకుడు ముందు తరాలకు ఆదర్శమని, చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ ముందుకు సాగుతుందని, వచ్చే ఎన్నికల్లో విజయం చంద్రబాబుదేనని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం నేత వెంకట్ కోగంటి సమన్వయ పరిచారు.ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, లక్ష్మణ్ పరుచూరి, గోకుల్ రాచవరపు, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ గొంప, కోటిబాబు కోటిన, భాస్కర్ అన్నే, మోహన్ , కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, రవి , సాయి ఖమాబాపతి ,మధు కందేపి సాయి యనమదల, పాములు నారాయణ వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, వీరు వుప్పల, సుభాష్ ఆర్, రవికిరణ్ ఆలేటి, రవి ఆలపాటి, సతీష్ బొల్ల, ప్రకాష్ ఎన్, తమిళనాడు ఎన్నారై టీడీపీ నేత కుమార్ వేల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-23T18:07:06+05:30 IST