ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: ఎన్నారై నిధుల వరద.. ప్రపంచంలో నెం.1గా నిలిచిన భారత్

ABN, Publish Date - Dec 18 , 2023 | 08:24 PM

భారత్ కీర్తి ప్రతిష్ఠలను నలుదిశలా చాటుతున్న ఎన్నారైలు స్వదేశాన్ని ఆర్థికంగా కూడా పరిపుష్టం చేస్తున్నారు. 2023లో ఎన్నారైలు భారత్‌కు 125 బిలియన్ డాలర్లను పంపించారు.

ఎన్నారై డెస్క్: భారత దేశ కీర్తి ప్రతిష్ఠలను నలుదిశలా చాటుతున్న ఎన్నారైలు స్వదేశాన్ని ఆర్థికంగా కూడా పరిపుష్టం చేస్తున్నారు. 2023లో ఎన్నారైలు భారత్‌కు 125 బిలియన్ డాలర్లను పంపించారు. దీంతో, అత్యధికంగా విదేశీ నిధులు అందిన దేశాల్లో భారత్ ఈ ఏడాది నెం.1గా నిలిచింది (India tops global remittance charts ). ప్రపంచబ్యాంకు చెందిన తాజా మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్‌లో ఈ విషయం వెల్లడైంది.

ఈ ఏడాది కూడా అభివృద్ధి చెందిన దేశాల నుంచి మధ్య, అల్పాదాయ దేశాలకు నిధుల వెల్లువ కొనసాగిందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. మొత్తం 665 బిలియన్ డాలర్ల నిధులు ఆయా దేశాలకు చేరాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈమారు3.8 శాతం అధికంగా నిధులు బదిలీ అయ్యాయని తెలిపింది. గల్ఫ్ దేశాలతో పాటూ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఆశావాహ వాతావరణం ఉండటంతో విదేశాల్లోని పౌరులు తమ సొంత దేశాలకు నిధులు పంపించగలిగారని పేర్కొంది.

ఈ ఏడాది కూడా భారత్‌కు అంచనాలకు మించి ఎన్నారై నిధుల వరద పారింది. మొత్తం 125 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో రికార్డు స్థాయిలో భారత్‌కు నిధులు వచ్చాయని ప్రపంచబ్యాంకు పేర్కొంది.

Updated Date - Dec 18 , 2023 | 08:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising