ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Typical actor Chandramohan : విలక్షణ నటుడు చంద్రమోహన్‌ ఇక లేరు

ABN, First Publish Date - 2023-11-12T05:06:01+05:30

హీరోగా.. హాస్యనటుడిగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. తెలుగువారందరూ సగర్వంగా చెప్పుకొనే మంచినటుడిగా.. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సీనియర్‌ నటుడు

హీరోగా.. హాస్యనటుడిగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. తెలుగువారందరూ సగర్వంగా చెప్పుకొనే మంచినటుడిగా.. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌(82) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న చంద్రమోహన్‌ ఆరోగ్యం దెబ్బతినడంతో.. ఇటీవల చంద్రమోహన్‌ ఫ్యామిలీ డాక్టర్‌ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన.. శనివారం ఉదయం అచేతనంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9.57 గంటలకు ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలున్నారు. చంద్రమోహన్‌ 1943, మే 23న.. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. సినిమాల్లోకి వచ్చాక చంద్రమోహన్‌గా మార్చుకున్నారు. ఆయన తల్లిదండ్రులు వీరభద్రశాస్త్రి, శ్యామలమ్మ. పాఠశాల విద్య మేడూరు గ్రామంలో పూర్తిచేసిన చంద్రమోహన్‌.. మచిలీపట్నంలోని హిందు కాలేజీలో పీయూసీ, బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ చేశారు.

ఏలూరులో వ్యవసాయశాఖలో కొంతకాలం పనిచేశారు. అయితే, కాలేజీ రోజుల నుంచీ ఆయనకు నటన అంటే ఇష్టం. బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1961 బ్యాచ్‌ విద్యార్థి అయిన చంద్రమోహన్‌.. తన మిత్రబృందంతో నాటకాలు వేసేవారు. ఆదుర్తి సుబ్బారావు పూర్తిగా కొత్త నటులతో ‘తేనె మనసులు’ తీయడంతో.. సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉద్యోగాన్ని వదులుకుని మరీ మద్రాసుకు వెళ్లారాయన. బీఎన్‌ రెడ్డి వంటి దిగ్దర్శకుడి దృష్టిలో పడి.. ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తర్వాత తన వద్దకు వచ్చిన అన్ని పాత్రలూ చేయడం మొదలుపెట్టడంతో.. చంద్రమోహన్‌లోని ఆల్‌రౌండర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు వెండితెరపై తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. చంద్రమోహన్‌లో ఆయనకే తెలియని టాలెంట్‌ ఉందని దర్శకులు బీఎన్‌ రెడ్డి, బాలచందర్‌, నటుడు ఎస్వీ రంగారావు అంటుండేవారు. ‘‘దర్శకులు ఎంత తీసుకోగలిగితే అంత ఇవ్వగల ప్రతిభ ఇతనిలో ఉంది’’ అనేవారు. నటనా పరంగా బీఎన్‌ రెడ్డి వేసిన బలమైన పునాది.. చంద్రమోహన్‌ను యాభై ఏళ్ల పాటు నటుడిగా నిలబెట్టింది. అలాగే కె.విశ్వనాథ్‌, బాపు, బాలచందర్‌, రాఘవేంద్రరావు, రేలంగి నరసింహారావు వంటి దర్శకుల మెప్పు పొందారాయన.

ప్రముఖుల నివాళులు..

ఫిలింనగర్‌లోని చంద్రమోహన్‌ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి, నివాళులర్పించారు. నటుడు బ్రహ్మానందం, జయసుధ, అన్నపూర్ణ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు నివాళులర్పించారు. కాగా.. అమెరికాలో ఉంటున్న చంద్రమోహన్‌ చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని చంద్రమోహన్‌ మేనల్లుడు కృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ, బాపట్ల

Updated Date - 2023-11-12T05:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising