Story : సమయస్ఫూర్తి
ABN, Publish Date - Dec 22 , 2023 | 03:50 AM
అనగనగా ఒక రాజు. ముక్కోపి. అతనితో కయ్యానికి కాలుదువ్విన రాజులెవ్వరూ బతికి బట్టకట్టలేదు. అయితే ప్రజలను మాత్రం బాగా పాలించేవాడు. ఎవరైనా సరే తనతో వాదించినా..
అనగనగా ఒక రాజు. ముక్కోపి. అతనితో కయ్యానికి కాలుదువ్విన రాజులెవ్వరూ బతికి బట్టకట్టలేదు. అయితే ప్రజలను మాత్రం బాగా పాలించేవాడు. ఎవరైనా సరే తనతో వాదించినా.. తన తప్పు తెలిపినా సహించలేని పరిస్థితి. కోపం వచ్చిందంటే.. సామాన్యుడినుంచి మంత్రి వరకూ శిక్ష తప్పదు. దీంతో అతనితో సావాసం చేయాలన్నా.. మాట్లాడాలన్నా.. బంధువులు కూడా సాహసించేవారు కాదు. అయితే అతడు మంచివాడు కాదా.. అంటే మంచివాడే. అతని బుద్ధి అలాంటిది.
ఒక రోజు రాజుగారి గడ్డం తీయటానికి దక్ష అనే వ్యక్తి వచ్చాడు. అతని గురువు లేకపోవటంతో ఈ కుర్రోడు వచ్చాడు. రాజుగారు అతన్ని పైకి కిందకి చూశాడు. గడ్డం తీయటం వచ్చా? అన్నాడు. అవును అన్నాడు ఆ కుర్రోడు. అసలే ఆ కుర్రోడు భయస్తుడు. ఎవరికీ భయపడడు. కొంటె పనులు చేస్తుంటాడు. మహా తెలివివంతుడు. సమయస్ఫూర్తి కలవాడు. గడ్డం తీస్తూ రాజుగారి సగం మీసాన్ని కావాలనే తీశాడు. క్షణాల్లో రాజుగారికి అర్థమై వాడి పట్ల గుడ్లు ఉరిమి చూశాడు. ఏమీ తెలియనట్లు ఆ కుర్రోడు ముఖం పెట్టాడు. పొరపాటున జరిగింది.. అంటూ వివరణ ఇవ్వబోయాడు. వీడికి చావు తప్పదు అనుకున్నారు పక్కన ఉండే జనాలు.
అయ్యా.. గడ్డం తీసిన తర్వాత నాకు శిక్ష వేద్దురుకానీ అన్నాడు ఆ దక్ష. సరే తగలడు అన్నాడు రాజుగారు. ఆ క్షణంలో వెంటనే ఓ పాచిక వదిలాడు దక్ష. ‘రాజుగారు.. ఎవరైనా సరే బలహీనతలకు తలొగ్గితే బయటపడలేడు కదా?’ అన్నాడు. ‘నాకేం లేదు’ అన్నాడు. అబద్ధం రాజుగారికైనా బలహీనతలుండవా?’ అన్నాడు. రాజుగారి అహం దెబ్బతినింది. ఎలాంటి బలహీనతనైనా అధిగమిస్తానన్నాడు. ‘మీకు మీసం లేకపోతే.. కచ్చితంగా బుగ్గదగ్గర చేయి పెట్టి మీసాలను రువ్వినట్లు అంటారు’ అన్నాడు. ‘నేనలా చేయను. నాకు మీసాలు లేకున్నా ఉండగలను’ అన్నాడంతే. క్షణాలో మిగిలిన అరమీసం తీసేశాడు దక్ష. రాజుగారికి మీసం లేదనే విషయం అర్థమైంది. ఇక పైకి లేచిన తర్వాత వీడికి బందిఖానా తప్పదు అనుకున్నారు మంత్రులు. రాజు దగ్గరకు అంతలోనే మహామంత్రి వచ్చాడు. యథావిధిగా మీసాన్ని రాజు సవరించుకున్నాడు. ‘చూడు బలహీనత’అన్నాడు దక్ష. ‘ఆహా.. ఎంత తెలివైనవాడవి. నిన్నేమి అనను. నాకో బుద్ధి చెప్పావు’ అంటూ వదిలేశాడు. దీంతో పాటు బంగారు నాణేలను దక్షకు బహుమతిగా ఇచ్చాడు.
Updated Date - Dec 22 , 2023 | 03:50 AM