ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నరకానికి మూడు దారులు

ABN, Publish Date - Dec 29 , 2023 | 06:42 AM

ఒకసారి మహా ప్రవక్త మహమ్మద్‌ తన సహచరులందరినీ మసీదులోని ఉపన్యాస పీఠం (మింబర్‌) సమీపానికి రమ్మని ఆహ్వానించారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఉపన్యసించడం

ఒకసారి మహా ప్రవక్త మహమ్మద్‌ తన సహచరులందరినీ మసీదులోని ఉపన్యాస పీఠం (మింబర్‌) సమీపానికి రమ్మని ఆహ్వానించారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఉపన్యసించడం కోసం మింబర్‌ మొదటి మెట్టు మీద కేలు పెట్టిన మహాప్రవక్త... ఒక్క క్షణం ఆగి... ‘ఆమీన్‌’ (అలాగు జరుగుగాక్‌) అన్నారు. రెండవ మెట్టు, మూడవ మెట్టుపైన కూడా అదే విధంగా చేశారు. ఇది చూసి ఆయన సహచరులు ఆశ్చర్యపోయారు

‘‘మహనీయ ప్రవక్తా! మీరు మింబర్‌ మీదికి ఎక్కుతున్నప్పుడు ‘ఆమీన్‌’ అని మూడుసార్లు అన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. దయచేసి కారణం వివరిస్తారా?’’ అని అడిగారు. దానికి మహాప్రవక్త బదులిస్తూ... ‘‘ఆ సమయంలో హజ్రత్‌ జిబ్రాయిల్‌ నా దగ్గరకు వచ్చారు. ‘‘రంజాన్‌ పవిత్ర మాసాన్ని వరంగా పొంది కూడా... ఆ మాసంలో దేవుని క్షమాపణ పొందడానికి ప్రయత్నించని మానవుణ్ణి... ఓ అల్లాహ్‌! నీవు నాశనం చెయ్యి’’ అన్నారు. ఆ మాటలు విన్న నేను ‘ఆమీన్‌’ అన్నాను. రెండవ మెట్టు మీద పాదాన్ని మోపుతూ ఉండగా... ‘‘మహా ప్రవక్త పేరును ఎవరైనా తన ముందు ప్రస్తావించినప్పుడు... ఆయనకు గౌరవపూర్వకంగా ‘దురూదె షరీఫ్‌’ ప్రార్థనను చేయనివారు నాశనమవుతారు’’ అని జిబ్రయిల్‌ అన్నారు. అప్పుడు నేను రెండోసారి ‘ఆమీన్‌’ అన్నాను. మూడవ మెట్టుపైకి పాదం పెడుతూ ఉండగా... ‘‘తల్లితండ్రులు జీవించి ఉన్న కాలంలో వారికి సేవలు చేయకుండా, వారి దీవెనలు పొందకుండా... స్వర్గానికి అనర్హులైనవారు నశించుగాక’’ అని జిబ్రాయిల్‌ శపించారు. నేను ‘ఆమీన్‌ ’అన్నాను. ఆ మూడూ జిబ్రాయిల్‌ ఇచ్చిన శాపాలు. అవి నరకానికి మూడు దారులు. వాటిని నాకు ఆయన వినిపించగానే... ‘ఆమీన్‌’ (అలాగే జరుగుగాక) అని చెప్పాను’’ అని మహా ప్రవక్త వివరించారు.

హజ్రత్‌ జిబ్రాయిల్‌ దైవదూతల నాయకుడు. అల్లాహ్‌ నుంచి దైవ గ్రంథాన్ని.. ‘వహీ’ (దైవాజ్ఞ) మేరకు అందించిన వాడు. కాబట్టి ఆయన శాపం సామాన్యమైనది కాదు. అలాగే అది జరగాలన్న మహాప్రవక్త మాట కూడా సాధారణమైనది కాదు. ఆ శాపాలకు గురికాకుండా, నరకం దారుల్లో పడకుండా చూసుకోవడం విశ్వాసుల కర్తవ్యం.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - Dec 29 , 2023 | 06:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising