ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salar : సలార్‌ సంచలనం

ABN, Publish Date - Dec 24 , 2023 | 02:42 AM

ప్రభాస్‌ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 175 కోట్ల వసూళ్లను రాబట్టిందని నిర్మాణంసంస్థ హోంబలే ఫిల్మ్స్‌

ప్రభాస్‌ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 175 కోట్ల వసూళ్లను రాబట్టిందని నిర్మాణంసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే రూ. 90 కోట్ల వసూళ్లు వ చ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సలార్‌’ నిలిచింది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో వసూళ్లు పుంజుకుంటున్నాయి. వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సలార్‌’ నిలుస్తుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రానికి రెండో భాగాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. శ్రుతీహాసన్‌ కథానాయిక.

ప్రభాస్‌కు మెగాస్టార్‌ ప్రశంసలు

‘సలార్‌’ సినిమా ఘన విజయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చే శారు. సూపర్‌హిట్‌ అందుకున్న ప్రభాస్‌ను, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘సలార్‌’ బాక్సాఫీసు దగ్గర అదరగొడుతోంది. కొత్త ప్రపంచాన్ని ప్రశాంత్‌ నీల్‌ అద్భుతంగా చూపించారు. జగపతిబాబు, శ్రుతీహాసన్‌ ఆకట్టుకున్నారు’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 02:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising