ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajamouli : ఫస్ట్‌ టికెట్‌ కొన్న రాజమౌళి

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:57 AM

ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో

ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ప్రభా్‌సతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘బాహుబలి’ని అందించిన దర్శకదీరుడు రాజమౌళి హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎం.ఎం. థియేటర్‌లో తొలి రోజు ఏడు గంటల షోకు ఫస్ట్‌ టికెట్‌ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటోలో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రశాంత్‌ నీల్‌, నవీన్‌ ఎర్నేని, హోంబలే ఫిల్మ్స్‌ విజయ్‌ కిరంగదూర్‌ కూడా ఉన్నారు.

వంద టికెట్లు పంచనున్న నిఖిల్‌

ఇదిలా ఉంటే ప్రభాస్‌ అభిమానుల కోసం తను ‘సలార్‌’ టికెట్లు పంచనున్నట్లు హీరో నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో తెల్లవారు జామున ఒంటిగంట షోకు సంబంధించి ప్రభాస్‌ డై హార్డ్‌ ఫ్యాన్స్‌కు వంద టికెట్లు ఇవ్వనున్నా. దాదాపు పదేళ్ల క్రితం ఇదే థియేటర్‌లో ఇదే సమయానికి ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ సినిమా చూశా. ఆ హిస్టరీని రిపీట్‌ చేద్దాం’ అని నిఖిల్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 05:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising