ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhagyashree : మాస్‌ హీరో.. క్లాస్‌ హీరోయిన్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:59 AM

హీరో రవితేజ, దర్శకుడు హరీశ్‌శంకర్‌ మాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి విదితమే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ

హీరో రవితేజ, దర్శకుడు హరీశ్‌శంకర్‌ మాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి విదితమే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాత. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ పేరును శనివారం నిర్మాతలు ప్రకటించారు. పూణేకు చెందిన మోడల్‌, నటి భాగ్యశ్రీ బోర్సే ఇందులో రవితేజ సరసన నటిస్తున్నారు. వీరిద్దరి క్లాస్‌, మాస్‌ కాంబినేషన్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుందని మేకర్స్‌ చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఇంట్రడక్షన్‌ పోస్టర్‌లో భాగ్యశ్రీ చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించారు. రవితేజ, హరీశ్‌శంకర్‌ కాంబో ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్‌లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Updated Date - Dec 17 , 2023 | 06:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising