ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Awareness : పసుపు తగుమాత్రంగానే...

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:13 AM

పసుపులో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. అందులో అనుమానం లేదు. అలాగని పరిమితి దాటితే దుష్ప్రభాలకూ గురి కాక తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది.

పసుపులో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. అందులో అనుమానం లేదు. అలాగని పరిమితి దాటితే దుష్ప్రభాలకూ గురి కాక తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది.

అల్లానికి సమీప బంధుమైన పసుపును కొన్ని వందల ఏళ్లుగా వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ వంటశాలల్లోని ప్రతి వంటకంలో పసుపు ఉండవలసిందే! ఆకర్షణీయమైన రంగును కలిగి ఉండడంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న కారణంగా మన వంటకాల్లో పసుపు కీలకంగా మారింది. అయితే పసుపులోని ప్రధాన దినుసు కుర్కుమిన్‌ పరిమితి మించిదే, జీర్ణం అవక, అల్సర్లకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. పసుపులో 2ు ఆక్సలేట్‌ కూడా ఉంటుంది. పరిమితి మించితే కొందర్లో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. పైగా ఎక్కువ శాతం బజార్లో దొరికే పసుపు పొడుల్లో విషపూరిత పదార్థాలు, కృత్రిమ రంగులు కలిసి ఉంటాయి. అలాగే కసావా స్టార్చ్‌, బార్లీ, రై పౌడర్‌, గోధుమ పిండి కూడా ఉంటాయి. గ్లూటేన్‌ ఇంటాలరెన్స్‌ ఉన్న వాళ్లు సీలియాక్‌ వ్యాఽధికి గురైన వాళ్లు ఇలాంటి కల్తీ పసుపు తీసుకుంటే, వాళ్ల లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అలాగే మెటల్‌ ఎల్లో కలర్‌ లేదా యాసిడ్‌ ఎల్లో అనే రంగుతో పసుపు కల్తీ జరుగుతోంది. ఇవి రెండూ కేన్సర్‌ కారకాలు. నాడీ సంబంధ సమస్యలను కూడా తెచ్చి పెడతాయి. పసుపుకు రక్తాన్ని పలుచన చేసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి అధిక మోతాదుల్లో తీసుకున్నప్పుడు, రక్తం గడ్డకట్టని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి యాంటీ కాగ్యులెంట్‌ మందులు వాడుతున్న వాళ్లు పరిమితికి మించి పసుపు తీసుకుంటే, రక్తస్రావానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పసుపు కొమ్ములను నూరి ఇంట్లో తయారుచేసుకున్న పసుపును పరిమితంగా మాత్రమే వాడుకోవడం మేలు.

ముప్పు వీళ్లకే ఎక్కువ

రక్తస్రావ సమస్య: ఇంజెక్టబుల్‌ బ్లడ్‌ థిన్నర్స్‌ వాడే వాళ్లు పసుపు మానేయడమే మేలు

గాల్‌ బ్లాడర్‌ స్టోన్స్‌: ఈ సమస్య ఉన్నవాళ్లు, బైల్‌ డక్ట్‌లో రాళ్లు ఇరుక్కోకుండా ఉండడం కోసం టర్మరిక్‌ సప్లిమెంట్లు తీసుకోవడం మానేయాలి

గ్యాస్ట్రో ఈసోఫీగల్‌ రిఫ్లక్స్‌: పసుపు ఈ సమస్యను మరింత పెంచుతుంది.

Updated Date - Dec 26 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising