ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Story : అసూయ

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:10 AM

ఆనందపురంలో ఇద్దరు పండితులుండేవారు. వారిద్దరికీ చెరో ఒక గురుకులం ఉండేది. వారి పేర్లు ప్రవరుడు, విదురుడు. ఇద్దరూ గురువులు. అయితే వారు కూడా మనుషులు కాబట్టి ఒకరిమీద మరొకరికి కోపం ఉండేది. వారిలో ప్రవరుడు తన శిష్యులకు శ్రద్దగా చదువు

ఆనందపురంలో ఇద్దరు పండితులుండేవారు. వారిద్దరికీ చెరో ఒక గురుకులం ఉండేది. వారి పేర్లు ప్రవరుడు, విదురుడు. ఇద్దరూ గురువులు. అయితే వారు కూడా మనుషులు కాబట్టి ఒకరిమీద మరొకరికి కోపం ఉండేది. వారిలో ప్రవరుడు తన శిష్యులకు శ్రద్దగా చదువు చెప్పేవాడు. పిల్లవాడు చెడిపోతే గురువుదే తప్పు అనేంత బాధ్యత ప్రవరుడిది. పెత్తనంతో కాకుండా వాత్సల్యం, ప్రేమతో చదువుచెప్పేవాడు ప్రవరుడు. తెలివైన పిల్లలు చదువు నేర్చుకుని త్వరగా వెళ్లిపోయేవారు. చదువు రాని వాళ్లు అక్కడే చదువుకుని మెల్లగా విద్యను పూర్తి చేసేవారు.

విదురుడు మాత్రం పిల్లలతో బండ చాకిరీ చేయించుకునేవాడు. తన పిల్లల బాగోగులు చూసుకోమనేవాడు. తనకు కావాల్సిన పనులు శిష్యుల సాయంతో చేయించుకునేవాడు. దీంతో అతని దగ్గర విద్యార్థులు పరీక్షల్లో తప్పేవారు. పైగా విపరీతమైన ఆలస్యంగా చదువు నేర్చుకునేవారు. దీంతో ఆయన దగ్గరకు ఎవరూ వచ్చేవారు కాదు.

అసలే విదురుడుకి పని చేయటం కష్టం. అతడు శిష్యులకు నేర్పింది సున్నా. ప్రవరుడికి మంచి పేరు రావటంతో తట్టుకోలేని విదురుడు రాజుగారి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు. ‘అయ్యా.. ప్రవరుడు ఒట్టి దొంగ. చదువు చెప్పటం రాదు. పైగా త్వరగా చదువు పూర్తి చేసినట్లు నమ్మబలికి.. వారికి యోగ్యతాపత్రం ఇచ్చి పంపుతున్నాడు. ఈ దుర్మార్గాన్ని అరికట్టాలి’ అంటూ దొంగ ఏడుపు ఏడిచాడు. తక్షణమే రాజుగారు ఇద్దరు పండితులను తన దగ్గరకు రప్పించండి అని ఆదేశించారు.

రాజుగారు పంపిన లేఖను చూసి ప్రవరుడు వెంటనే గుర్రం బండిలో రాజుగారి దగ్గరకు బయలుదేరాడు. విదురుడు కూడా ఉత్సాహంగా ఎద్దుల బండి మీద బయలుదేరాడు. రాజుగారు ప్రవరుడిని మొదట చూశాడు. అదేంటీ నిందితుడే ముందు వచ్చాడు. అతని మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏడీ? అన్నాడు. ఆయన ఇంకా రాలేదన్నారు. వెంటనే విచారణ వాయిదా వేద్దామని రాజుగారు అనుకున్నారు.

ఆ క్షణంలో ప్రవరుడు రాజుగారితో ‘ఓ విన్నపం’ అన్నాడు. చెప్పమన్నారు రాజుగారు. ‘ఇద్దరం ఒకేసారి బయల్దేరాం. నేను గుర్రం బండి మీద వచ్చా. ఆయన ఎద్దుల బండి మీద వస్తున్నాడు. చదువుల్లోనూ అంతే. నేను వేగం. ఆయన నిదానం. నాశిష్యులు కూడా వేగమే’ అన్నారు ప్రవరుడు. రాజుకు విషయం అర్థమైంది. అసలు వీరి వెనకాల సంగతులు చెప్పండి అని ఆదేశించాడు. ప్రవరుడి మంచితనం, గొప్పదనం తెలిసింది. వెంటనే ప్రవరుడిని ఆస్థానపండితుడిగా ప్రకటించాడు రాజుగారు. విదురుడు అసూయతో తప్పుడు ఫిర్యాదు చేసినందుకు అతన్ని తన గోశాలలో పని చేయాలని ఆదేశించాడు. అదీ అసూయకు తగిన ఫలితం.

Updated Date - Dec 26 , 2023 | 12:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising