ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ తెలిసేదెలా?

ABN, First Publish Date - 2023-11-04T00:05:14+05:30

స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలులో పరిగణించే అంశాల్లో బ్యాటరీ కూడా ముఖ్యమైనదే. దాని జీవితకాలం ఎంత అన్నది తెలుసుకోవాలి.

స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలులో పరిగణించే అంశాల్లో బ్యాటరీ కూడా ముఖ్యమైనదే. దాని జీవితకాలం ఎంత అన్నది తెలుసుకోవాలి. అయితే కాలం కరుగుతున్న కొద్దీ బ్యాటరీ జీవితం కూడా సన్నగిల్లుతుంది. అది చార్జింగ్‌ రేటులో ప్రస్ఫుటమవుతుంది. అవేంటంటే

కొద్ది సేపు ఉపయోగించినా బ్యాటరీ డౌన్‌ అవుతుంది.

రోజులో ఎక్కువసార్లు చార్జింగ్‌ పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

ఫోను తరచూ షట్‌డౌన్‌ అవుతుంటే అది బ్యాటరీ సమస్యగా గుర్తించాలి.

ఓవర్‌ హీటింగ్‌ కూడా ఒక సూచికే

బ్యాటరీ ఉబ్బడం కూడా ఒక అంశమే.

బ్యాటరీ లైఫ్‌ తగ్గిందని గుర్త్తిస్తే వెంటనే మార్చుకోవాల్సిందే.

మరికొన్ని....

ఆండ్రాయిడ్‌ డివైజ్‌లో ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి బ్యాటరీ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయాలి. గడచిన 24 గంటల్లోని బ్యాటరీ స్టాటస్‌ తెలుస్తుంది. అక్కడే ఏ యాప్స్‌ కారణంగా బ్యాటరీ లైఫ్‌ దెబ్బతింటోందో కూడా అర్థమవుతుంది. అనవసరమైన, బ్యాటరీ లైఫ్‌ని బాగా తింటున్న యాప్‌లను తొలగించడం అందుకు పరిష్కారం.

సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌తో బ్యాటరీ జీవితాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఫిజికల్‌గా బ్యాటరీ డ్యామేజ్‌ అయితే మాత్రం సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ ఉపయోగపడదు.

కొన్ని ఫోన్లలో బ్యాటరీని యూజర్‌ మార్చుకోవచ్చు. అందుకు అనుగుణంగా అవి ఉంటాయి. సీల్డ్‌ డిజైన్‌లో ఉంటే మాత్రం టెక్నీషియన్‌ మాత్రమే బ్యాటరీని రీప్లేస్‌ చేయగలుగుతారు.

ఉపయోగించుకునే తీరును అనుసరించి బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. సగటున రెండు మూడేళ్ళకు డీగ్రెడేషన్‌ సూచికలు కనిపిస్తాయి.

Updated Date - 2023-11-04T00:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising