ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flu season : ఈ టిప్స్ ఫాలో అయితే పిల్లల్లో కనిపించే ఫ్లూకి చెక్ పెట్టినట్టే..!!

ABN, Publish Date - Dec 20 , 2023 | 03:13 PM

ఆరోగ్యంగా ఉండాలంటే తగిన హైడ్రేషన్ అవసరం. రోజులో పుష్కలంగా నీరు త్రాగాలి.

highly contagious

శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడటం అంటే సర్వసాధారణమే.. కానీ ఈ సీజన్ లో ఎక్కువగా పెద్దలకన్నా పిల్లలే వ్యాధులు, అలెర్జీలకు గురవుతూ ఉంటారు. అయితే ఇన్ఫ్లుఎంజా పిల్లల్లో అనారోగ్యాన్ని పెరిగేలా చేస్తుంది. ఇందుకు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం అనేది ఫ్లూ సంక్రమించేందుకు అధిక ప్రమాదంగా మారుతుంది. దీని లక్షణాలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. జ్వరం, శరీరం అంతా నొప్పులు, ముక్కు కారణం, గొంతు నొప్పి, అలసట. తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మన పిల్లలు ఫ్లూ బారిన పడకుండా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.

ఎటువంటి జాగ్రత్తలు అవసరం..

1. పిల్లల్లో ఫ్లూ వ్యాధి లక్షణాలు పెరగకుండా ఉండాలంటే దానికి పెద్దల చేయూత చాలా అవసరం. టీకాలు వేయించడం,. తరచుగా చేతులు కడుక్కునేలా చూడటం, ఎవివేటర్ తలుపులు, ఫర్నీచర్, బయటి వస్తువులను, గదిలో మూలలను తాకకుండా చూడటం కూడా ముఖ్యమే. పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ ని దూరంగా ఉంచాలి. రోగనిరోధక శక్తి పెరిగేలా చూడాలి.

2. ఇన్ఫ్లుఎంజా లక్షణాలు జ్వరం, దగ్గు, అలసట వంటి లక్షణాలు నుంచి తప్పించుకోవాలంటే ముందుగా ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ లక్షణాలున్నవారు ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం కావచ్చు. నియంత్రణకు ప్రయత్నాలు కష్టతరం కావచ్చు.

3. ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలను పాఠశాలకు పంపించకపోవడం మంచిది.

4. సకాలంలో పిల్లలకు వేయించాల్సిన టీకాలను ఇవ్వాలి.


నివారణ చర్యలు..

1. తరచుగా చేతులు కడుక్కోవడం, శ్వాసకోశ పరిశుభ్రతను ప్రోత్సహించడం కూడా మార్పును కలిగిస్తుంది. ఎందుకంటే పిల్లలలో జెర్మ్స్, వైరస్ల వ్యాప్తిని పరిమితం చేయడంలో సహాయపడతాయి.

2. పిల్లలు తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులతో ఉండే సమతుల్య ఆహారం ఇవ్వాలి.


జంక్ ఫుడ్ ఇవ్వడం మానండి..

1. జంక్, ఆయిల్ క్వాన్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా పిల్లల్ని ఉంచాలి. తల్లిదండ్రులు దీని కోసం నిపుణుల సహాయం తీసుకోవాలి.

2. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన హైడ్రేషన్ అవసరం. రోజులో పుష్కలంగా నీరు త్రాగాలి.

3. చల్లని నెలల్లో ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.

4. ఏదైనా వస్తువును తాకిన తర్వాత ముఖాన్ని తాకే అలవాటును కూడా మానేయాలి.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 03:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising