ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: మీకు పాదాలు, అర చేతుల్లో చెమటలు పడుతున్నాయా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోండి..

ABN, First Publish Date - 2023-09-17T13:57:35+05:30

శరీరానికి చెమటలు పట్టడం అనేది సాధారణంగా మంచి లక్షణంగానే భావిస్తారు. కష్టపడి పని చేసినప్పుడు, వేడి అధికంగా ఉన్నప్పుడో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే క్రమంలో చెమట పడుతుంది. అయితే కొందరికి చెమట చాలా విపరీతంగా పడుతుంది.

శరీరానికి చెమటలు (Sweating) పట్టడం అనేది సాధారణంగా మంచి లక్షణంగానే భావిస్తారు. కష్టపడి పని చేసినప్పుడు, వేడి అధికంగా ఉన్నప్పుడో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే క్రమంలో చెమట పడుతుంది. అయితే కొందరికి చెమట చాలా విపరీతంగా పడుతుంది (Excessive sweating). చలికాలంలో కూడా చెమటలు పడతాయి. అలాగే పాదాలు, అరచేతుల్లో కూడా కొందరికి బాగా ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే కొంచెం జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు (Health News).

గుండె సంబంధిత సమస్యలతో (Heart Problems) బాధపడుతున్నప్పుడు సాధారణంగా చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. గుండె నొప్పి (Heart Attack) వచ్చే ముందు విపరీతంగా చెమటలు పోయడాన్ని ఓ లక్షణంగా పేర్కొంటున్నారు. హృదయ స్పందన రేటు తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా గుండెలో అడ్డంకులు ఏర్పడినప్పుడు విపరీతమైన చెమటలు ఏర్పడతాయి. ఇక, మధుమేహ రోగులకు (Diabetic patients) కూడా చెమటలు పడుతుంటాయి. రక్తంలో చక్కెర శాతం అకస్మాత్తుగా పడిపోయినప్పుడు విపరీతంగా చెమట పడుతుంది. వెంటనే స్వీట్లు తినకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

Kidney Stones: బీర్లు తాగితే కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయా? అసలు నిజమేంటి? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

ఇక, కొందరు వ్యక్తులకు అరికాళ్లలోనూ, అరచేతుల్లోనూ విపరీతంగా చెమటలు పడుతుంటాయి (Sweat in hands and feet). స్వల్పంగా చెమటలు పడితే ఫర్వాలేదు కానీ, మీరు ఏది పట్టుకుంటున్నా ఆ వస్తువు తడిసిపోతుంటే మాత్రం అర్జెంటుగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ (Kidney Problems) వైఫల్యానికి ముందస్తు లక్షణంగా అరికాళ్లలోనూ, అరచేతుల్లోనూ చెమటలు పట్టడం కనిపిస్తుంది. రక్తాన్ని శుభ్రం చేసే సామర్థ్యాన్ని క్రమంగా కిడ్నీలు కోల్పోతున్నప్పుడు శరీరంలోని ఇతర భాగాలతో పాటు ఇలా అరచేతులు, అరికాళ్ల నుంచి కూడా చెమట బయటకు వస్తుంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం కలిగిన వారికి అధిక థైరాక్సిన్ ఉత్పత్తి కారణంగా కూడా చెమట ఎక్కువ పడుతుంటుంది.

Updated Date - 2023-09-17T14:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising