ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Food and Health: పెరుగు vs మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

ABN, Publish Date - Dec 30 , 2023 | 09:06 PM

పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ఉత్పత్తుల్లో మనం ఎక్కువగా ఉపయోగించేది పెరుగు, మజ్జిగలనే. పాలలో కొంత పెరుగు వేసినపుడు లాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగులా మారుస్తుంది. పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్, అవసరమైన పోషకాలు ఉంటాయి

పాల ఉత్పత్తులు (Dairy Products) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ఉత్పత్తుల్లో మనం ఎక్కువగా ఉపయోగించేది పెరుగు (Curd), మజ్జిగలనే (Buttermilk). పాలలో కొంత పెరుగు వేసినపుడు లాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగులా మారుస్తుంది. పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్, అవసరమైన పోషకాలు ఉంటాయి. పెరుగు నుంచి వెన్నను తీసేసి తయారు చేసే ద్రవం మజ్జిగ. పెరుగు, మజ్జిగ ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఆహారాలలో భాగంగా ఉన్నాయి. మరి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకారో ఒకసారి పరిశీలిద్దాం (Food and Health).


పెరుగు:

పాలను మంచి బ్యాక్టీరియాతో కలిపి పులియబెట్టడం ద్వారా పెరుగు తయారవుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు బాగా దోహదపడుతుంది. అలాగే పెరుగులో ఉండే ప్రొటీన్ కండరాల నిర్వహణ, మరమ్మత్తు, శరీరం పనితీరుకు ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. అలాగే అధికంగా ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఎంతో కీలకం. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని అనేక పరిశోధనల్లో బయటపడింది.


మజ్జిగ:

పెరుగు నుంచి వెన్నను తీసేసి నీటిని కలిపి మజ్జిగను తయారు చేస్తారు. అంటే మజ్జిగ అనేది పెరుగు యొక్క ఉప ఉత్పత్తి. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. పెరుగుతో పోల్చుకుంటే మజ్జిగలో ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. పాలు, పెరుగుతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి మరింత ప్రయోజనకారి. అలాగే మజ్జిగ అనేది హైడ్రేటింగ్ పానియం. శరీరానికి అవసరమైన ద్రవాలను అందిస్తుంది. అలాగే అనేక సంస్కృతులలో, మజ్జిగను శీతలీకరణ పానీయంగా పరిగణిస్తారు, ఇది వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరుస్తుంది.

రెండింటిలో ఏది ఉత్తమం..

ఆయుర్వేదం ప్రకారం పెరుగు కంటే మజ్జిగ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పెరుగులో అధిక స్థాయిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలో వేడిని పెంచుతుంది. మజ్జిగ మంచి శీతలీకరణిగా పని చేస్తుంది. మన జీర్ణవ్యవస్థ పెరుగు కంటే ఎక్కువగా మజ్జిగను శోషణ చేసుకుంటుంది. జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వంటివి కలపడం వల్ల మజ్జిగ రుచి పెరగడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే మజ్జిగ మన శరీరాన్ని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

Updated Date - Dec 30 , 2023 | 09:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising