ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

A sleep schedule: నిద్రకు సరైన సమయాన్ని కేటాయించకపోతే ఇన్ని సమస్యలా.. !!

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:37 PM

ప్రతి రోజూ త్వరగా నిద్రపోవడానికి నిద్ర షెడ్యూల్ ని అనుసరించడం ముఖ్యం.

Better sleep quality

రోజువారి జీవనశైలిలో మార్పులు రావడం అంటే అది నిద్ర మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. సరైన నిద్ర లేకపోతే రోజూ వారి పనులేకాదు. మొత్తం దినచర్యలోనే వెలితి కనిపిస్తుంది. స్లీప్ షెడ్యూల్, స్లీప్ రొటీన్ లేదా స్లీప్ ప్యాటర్న్ అని కూడా పిలుస్తారు. దీనికి సరైన నిద్ర చక్రం అవసరం. ఇది శరీరాన్ని చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన నిద్ర ఉన్నట్లయితే రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిద్ర షెడ్యూల్ ను అనుసరించడం వల్ల శరీరానికి విశ్రాంతితో పాటు ఏకాగ్రత, తెలివి తేటల విషయంలో మెదడు చురుగ్గా ఉంటుంది.

మెరుగైన నిద్ర నాణ్యత..

నిద్రకు సరైన సమయం ఉండాలి. ప్రతి రోజూ త్వరగా నిద్రపోవడానికి నిద్ర షెడ్యూల్ ని అనుసరించడం ముఖ్యం. ఇది శరీరం అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహకరిస్తుంది. ఉదయం రోజును మొదలు పెడుతూనే దినచర్యను ప్లాన్ చేసుకోవడం, విశ్రాంతి తీసుకున్నప్పుడు రోజంతా అప్రమత్తంగా ఏకాగ్రతతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మెరుగైన మానసిక స్థితి..

మంచి మానసిక ఆరోగ్యానికి నిద్ర అవసరం. నిద్ర షెడ్యూల్ ను అనుసరించడం వల్ల భావోద్వేగాలను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, మొత్తం శరీర శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: మెంతి నీటిని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్ని లాభాలా..!! ఓసారి ట్రై చేసి చూడండి.


నిద్ర షెడ్యూల్ ను అనుసరించనపుడు శరీరం దినచర్యకు అలవాటు పడుతుంది. శక్తిని అందుకుంటుంది. రోజువారి జీవనశైలిలో మార్పులు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

నిద్ర సరిగా ఉంటే అది మన బరువును కూడా నియంత్రిస్తుంది. సరైన నిద్రలేకపోవడం అనేది మన శరీర బరువును పెంచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికీ 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం.

ఇంకా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ధకాలిక రోగాల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 12:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising