నైన్టీస్‌లో సరదాలు, సంఘర్షణలు
ABN, Publish Date - Dec 31 , 2023 | 04:43 AM
నటుడు శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘నైన్టీస్’. ‘ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ఉపశీర్షిక. 90వ దశకంలో మధ్యతరగతి కుటుంబాల సరదాలు,
నటుడు శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘నైన్టీస్’. ‘ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ఉపశీర్షిక. 90వ దశకంలో మధ్యతరగతి కుటుంబాల సరదాలు, సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కించారు. జనవరి 5 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం సమర్పకులు. శనివారం ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘‘నైన్టీస్’ చాలా అందమైన కథ. ఆదిత్య అద్భుతంగా తీశారు. మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే సిరీస్ ఇది. ఈ సిరీ్‌సకు సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపారు.
Updated Date - Dec 31 , 2023 | 04:43 AM