ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gummadi : ఇలాంటి వేషాలు వెయ్యక

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:01 AM

సాత్వికాభినయంలో సీనియర్‌ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుకు సాటి మరెవరూ లేరని చెప్పాలి. తెరపై ఆయన కనిపించగానే మన కుటుంబంలో

సాత్వికాభినయంలో సీనియర్‌ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుకు సాటి మరెవరూ లేరని చెప్పాలి. తెరపై ఆయన కనిపించగానే మన కుటుంబంలో వ్యక్తినే చూస్తున్న భావన కలుగుతుంది. బాబాయితోనే, తాతయ్యతోనే మాట్లాడుతున్నట్లే ఉంటుంది. అగ్ర నటులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కంటే తను వయసులో చిన్న అయినా వారిద్దరికీ తండ్రిగా నటించి మెప్పించారు గుమ్మడి. ఏ రసాన్ని అయినా అధ్భుతంగా అభినయించే నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయినా వైవిధ్యం కోసం గుమ్మడి కొన్ని చిత్రాల్లో దుష్ఠ భూమికలు పోషించి ఒకరకంగా తన మీద తనే ప్రయోగాలు చేశారు. అయితే ఆ తరహా పాత్రల్లో ఆయన్ని చూడడానికి జనం ఇష్టపడేవారు కాదు. రచయిత, దర్శకుడు గోపీచంద్‌ వంటి వ్యక్తే ఓ సందర్భంలో ‘సినిమాల్లో నిన్ను చెడ్డవాడిగా చూడలేనయ్యా’ అన్నారంటే గుమ్మడికి ఉన్న ఇమేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. సాత్విక పాత్రలతో పాటు ‘సతీ తులసి’, ‘ఇద్దరు మిత్రులు’, ‘రాజమకుటం’, ‘మర్మయోగి’ వంటి చిత్రాల్లో దుష్ఠ భూమికలు పోషించారు గుమ్మడి. ‘సతీ తులసి’ విషయానికి వస్తే అందులో జలంధరుడిగా గుమ్మడి నటించారు. మొదటి నుంచీ క్రూర స్వభావం కలిగిన పాత్ర కాదది. దైవభక్తి కలిగిన వ్యక్తి. అయితే తన జాతి మీద దేవతలు కక్ష కట్టారనే క్రోధంతో రాక్షసుడిగా మారతాడు. ఆ పాత్రకు తన వంతు న్యాయం చేయడానికి గుమ్మడి ప్రయత్నించారు. దర్శకుడు విక్టరీ మధుసూదనరావు ‘సతీ తులసి’ చిత్రంతోనే పరిచయమయ్యారు. ఎస్‌.వరలక్ష్మి టైటిల్‌ రోల్‌ పోషించారు. ఈ సినిమా ప్రీవ్యూ చూసిన తర్వాత విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి ‘నువ్వు బాగానే చేశావనుకో.. కానీ పాత్ర రాణించలేదు. దానికి తగ్గ క్రూరత్వం నీ ముఖంలో ఎక్కడొస్తది? ఇంకెప్పుడూ ఇలాంటి వేషాలు వెయ్యక. వాటికి పనికి రావు’ అన్నారు గుమ్మడితో.

Updated Date - Dec 17 , 2023 | 06:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising