Character count : నోట్‌ప్యాడ్‌లో క్యారెక్టర్ కౌంట్
ABN, Publish Date - Dec 16 , 2023 | 04:29 AM
మైక్రోసాఫ్ట్ కొద్ది రోజులుగా నోట్‌ప్యాడ్‌ను అప్డేట్ చేస్తోంది. తాజాగా కేరెక్టర్ కౌంట్ ఫీచర్‌ను అప్డేట్ చేసింది. విండోస్ 11
మైక్రోసాఫ్ట్ కొద్ది రోజులుగా నోట్‌ప్యాడ్‌ను అప్డేట్ చేస్తోంది. తాజాగా కేరెక్టర్ కౌంట్ ఫీచర్‌ను అప్డేట్ చేసింది. విండోస్ 11 ఈ విషయాన్ని తెలిపింది. నోట్‌ప్యాడ్ అడుగున ఈ ఫీచర్ జత అయింది. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌లో మాదిరిగానే నోట్‌ప్యాడ్‌లోనూ ఉంటుంది. టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే స్టాటస్ బార్‌పై కేరక్టర్ కౌంట్ కనిపిస్తుందని మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌పోస్టులో వెల్లడించింది. అలా కొంత మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే విడివిడిగా రెండు కౌంట్‌లు కనిపిస్తాయి. నోట్ ప్యాడ్‌లో మరికొన్ని ఫీచర్లకు కూడా ఇటీవల కలిపింది. ఆటోసేవ్ ఆప్షన్ అందులో ఒకటి. దీంతో పాపప్ సేవ్ ప్రాంప్ట్‌ను ప్రతిసారి చూడకుండానే నోట్‌ప్యాడ్‌ను క్లోజ్ చేయవచ్చు. ఇదేకాకుండా ట్యాబ్స్, డార్క్ మోడ్, వర్చ్యువల్ ఫిడ్జెట్ స్పిన్నర్‌ను కూడా కలిపింది. ఓఎస్ విడ్జెట్స్ విభాగంలో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేసింది. వీటితో అనతి కాలంలోనే యూజర్లు - విడ్జెట్స్‌ను ప్రదర్శించవచ్చు. విడ్జెట్స్ స్ర్కీన్ పక్కన కనిపించే న్యూస్, ఆర్టికల్స్‌ను దాచిపెట్టవచ్చు.
Updated Date - Dec 16 , 2023 | 04:29 AM