Finger Clubbing : గోళ్లలో మార్పులు లంగ్ కేన్సర్‌కు సూచనలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:15 AM
దగ్గు, ఊపిరి అందకపోవడం ఊపిరితిత్తుల కేన్సర్ ప్రధాన లక్షణాలు. వీటికి తోడు ఫింగర్ క్లబ్బింగ్ అనే లక్షణాన్ని కూడా లంగ్ కేన్సర్ సూచనగా
దగ్గు, ఊపిరి అందకపోవడం ఊపిరితిత్తుల కేన్సర్ ప్రధాన లక్షణాలు. వీటికి తోడు ఫింగర్ క్లబ్బింగ్ అనే లక్షణాన్ని కూడా లంగ్ కేన్సర్ సూచనగా భావించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఛాతీలో నొప్పి, తీవ్రమైన దగ్గు, ఊపిరి అందకపోవడం, దగ్గుతో పాటు రక్తం పడడం లాంటివన్నీ ఊపిరితిత్తుల కేన్సర్ ప్రారంభ లక్షణాలు. అయితే ఈ లక్షణాలతో పాటు ఎవరూ అంతగా దృష్టి సారించని మరో లక్షణం కూడా ఉంది. అదే ఫింగర్ క్లబ్బింగ్. ఫింగర్ క్లబ్బింగ్‌లో వేళ్ల అంచులు గుండ్రంగా మారి, గోళ్లు వెడల్పై, కిందకు వంపు తిరుగుతాయి. గోళ్ల మెరుపు కూడా పెరుగుతుంది. ఇలాంటి ఫింగర్ క్లబ్బింగ్ ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో పాటు థైరాయిడ్ సమస్యలు, అల్సరేటివ్ కొల్లైటిస్, క్రోన్స్ డిసీజ్‌లో కూడా కనిపిస్తుంది. అయితే ఈ లక్షణం ఎంతో నెమ్మదిగా తీవ్రమవుతుంది. కాబట్టి దీని దశలను గమనించాలి. మొదటి దశలో గోళ్ల చివర్లు చర్మం నుంచి వదులై, విడిపోతాయి. గోళ్లు కింది వంపు తిరగడం మొదలుపెడతాయి. గోళ్ల మెరుపు పెరుగుతుంది. కాళ్లు, చేతుల గోళ్లన్నీ ఇలాగే వంపు తిరగడం మొదలు పెట్టినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.
Updated Date - Dec 26 , 2023 | 12:15 AM