ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చలి కాలం పెరుగు తినొచ్చా?

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:18 AM

చలి కాలం చాలా మంది పెరుగు తినడం మానేస్తారు. చలి కాలంలో చలువ చేసే పెరుగు తింటే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుకుంటుందనేవి వాళ్ల భయం.

చలి కాలం చాలా మంది పెరుగు తినడం మానేస్తారు. చలి కాలంలో చలువ చేసే పెరుగు తింటే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుకుంటుందనేవి వాళ్ల భయం. అయితే నిజంగానే ఈ కాలంలో పెరుగు తినడం మానేయాలా?

చలి కాలంలోని చల్లని గాలుల వల్ల శరీర జీర్ణ వ్యవస్థ పనితీరు కొద్దిగా కుంటు పడుతుంది. దాంతో ఇన్‌ఫ్లమేషన్‌, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు కొందర్లో కనిపిస్తాయి. ఈ ఇబ్బందులన్నీ తొలగాలంటే ప్రతి రోజూ తప్పనిసరిగా పెరుగు తినాలి. పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. కాబట్టి రోగనిరోధకశక్తి కుంటుపడే చలి కాలంలో పెరుగు తప్పనిసరిగా తినాలి. పెరుగులోని ప్రొబయాటిక్స్‌ పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతాయి. అయితే అలర్జీ, ఆస్తమా సమస్యలు ఉన్నవాళ్లు సాయంత్రం ఐదు తర్వాత పెరుగు తినడం సరి కాదు. చల్లని వాతావరణం సరిపడని వాళ్లు పెరుగు తినాలనుకుంటే, ఆహారంలో వేడిని పెంచే పదార్థాలను చేర్చుకోవాలి. అసాధారణమైన అధిక రక్తపోటు హృద్రోగాలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వాళ్లు పెరుగు తింటే రక్తపోటు తగ్గుతుంది.

Updated Date - Dec 26 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising