ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Body language : బాడీ లాంగ్వేజ్‌ ట్రిక్స్‌!

ABN, First Publish Date - 2023-11-15T03:18:23+05:30

ఎదుటి వారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్‌ మీద ఆధారపడి ఉంటుంది. నిలబడే తీరు,

ఎదుటి వారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్‌ మీద ఆధారపడి ఉంటుంది. నిలబడే తీరు, ముఖంలో ఒలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

పోశ్చర్‌: నడిచేటప్పుడు భుజాలు వెనక్కి, చుబుకం పైకి ఉండాలి. నిటారుగా ఉండాలి. శరీరం గురించిన కాన్షియస్‌ కలిగి ఉండాలి.

ముఖకవళికలు: ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి. ఇతరులు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. చిరునవ్వు మీ గురించి ఎదుటివాళ్లలో సద్భావన కలుగుతుంది.

స్వరం: అనవసరంగా గొంతు పెంచి మాట్లాడకూడదు. సందర్భాన్నిబట్టి స్వరం మారుస్తూ ఉండాలి. మార్దవం, గంభీరం, సున్నితత్వం స్వరంలో సందర్భానుసారంగా తొణికిసలాడాలి.

చేతుల కదలికలు: అవసరాన్నిబట్టి భావ వ్యక్తీకరణకు తోడ్పడేలా చేతులు కదిలించాలి. మీరు వ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని చేతుల కదలికలు స్పష్టం చేసేలా ఉండాలి.

కళ్లు: పరిచయం చేసుకునేటప్పుడు సూటిగా కళ్లలోకి చూడాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడూ కళ్లలోకి చూస్తూ వినాలి.

నడక: ఎంత హడాహుడిలో ఉన్నా ఆ తొందర నడకలో ప్రతిబింబించకూడదు. నడకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి.

కూల్‌: క్రమశిక్షణతో మెలగాలి. ఎంత చిరాకు వచ్చినా స్థిరత్వం కోల్పోకూడదు.

Updated Date - 2023-11-15T03:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising