ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ananya Pandey : నవ యవ్వనం

ABN, First Publish Date - 2023-12-11T00:24:13+05:30

చిత్ర పరిశ్రమలో వారసత్వాలు కొత్తేమీ కాదు. ఏ ‘ఉడ్‌’కు వెళ్లినా క్యూ కట్టి కనిపిస్తారు. అనన్యా పాండే కూడా అలా పరిచయమైన అమ్మాయే. కానీ వారెవరికీ

చిత్ర పరిశ్రమలో వారసత్వాలు కొత్తేమీ కాదు. ఏ ‘ఉడ్‌’కు వెళ్లినా క్యూ కట్టి కనిపిస్తారు. అనన్యా పాండే కూడా అలా పరిచయమైన అమ్మాయే. కానీ వారెవరికీ ఎదురవ్వని ప్రతికూల పరిస్థితులు ఆమెను వెంటాడాయి. విమర్శలు, అంతకు మించిన పరిహాసాలు స్వాగతం పలికాయి. అయినా కుంగిపోలేదు. వాటన్నిటినీ తట్టుకొని మనోధైర్యంతో నిలబడింది.

నిన్నటి తరం బాలీవుడ్‌ నటుడు చంకీ పాండే కూతురుగా ‘తెర’ మీదకు వచ్చింది అనన్యా పాండే. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ ఆమె తొలి చిత్రం. అది మొదలు... ‘బంధుప్రీతికి నువ్వు బ్రాండ్‌ అంబాసిడర్‌’ అంటూ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో అనన్యాను మాటలతో వేధిస్తున్నారు కొందరు. తను కూడా వీటికి గట్టిగానే బదులిచ్చింది. ‘బంధుప్రీతి లేనిదెక్కడ? ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు... ప్రతి రంగంలోనూ ఉంది. వెనకాల గాడ్‌ఫాదర్లున్నా ప్రతిభ అనేది లేకపోతే ఎవరూ మన మీద పెట్టుబడి పెట్టరు’ అంటూ వారి నోళ్లకు తాళాలు వేసింది. పూరీ జగన్నాథ్‌ ‘లైగర్‌’తో దక్షిణాదిలో కూడా ప్రాచుర్యం పొందిన అనన్యా... హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె తన జీవితంలో సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో... ఫిట్‌నె్‌సకూ అంతే ఇస్తుంది. అదే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుగోగల మనోధైర్యం తనకు ఇస్తుందని, ఆరోగ్యకర జీవనానికి మార్గమయిందనేది అనన్యా మాట.

వర్కవుట్‌ ఇలా...

షూటింగ్‌లు, పార్టీలతో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత శ్రద్ధ విషయంలో అస్సలు రాజీ పడదు అనన్యా. తినే తిండి అయినా, చేసే వ్యాయామాలైనా, ధరించే డ్రెస్‌లైనా, వేసుకొనే మేకప్‌ అయినా... అన్నీ పక్కాగా ఉండేలా చూసుకొంటుంది. ‘ముందు మనల్ని మనం ప్రేమించాలి. మన శరీరం చెప్పేది వినాలి. గౌరవించాలి. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం’ అంటున్న అనన్యా దాని కోసం నిరంతరం శ్రమిస్తుంది. ‘రోజూ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీవక్రియ మెరుగవుతుంది. హృద్రోగాల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాదు... మన శరీరం కూడా ఆరోగ్యంగా, కాంతిమంతంగా మారుతుంది. అన్నిటికీ మించి రోజంతా నన్ను ఉత్తేజంగా ఉంచుతుంది. ముఖ్యంగా యోగావల్ల రక్తప్రసరణ పెరిగి, చర్మానికి మరింత ప్రాణవాయువు అందుతుంది. దానివల్ల చర్మం నాజూక్కా తయారవుతుంది’ అంటూ ఓ సందర్భంలో ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

  • యోగాతో రోజు ఆరంభం అవుతుంది. ‘ఉదయం లేవగానే వ్యాయామాలు చేయడంవల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటాం. పనిలో ఏకాగ్రత కుదురుతుంది. ఇతర సమయాలతో పోలిస్తే క్యాలరీలు అధికంగా ఖర్చవుతాయి’... ఇది అనన్యా అనుభవంలో నుంచి వచ్చిన మాట.

  • అదేపనిగా వెయిట్‌లిఫ్టింగ్‌, కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడం అంత మంచిది కాదన్నది ఈ బ్యూటీ అభిప్రాయం. ‘జిమ్‌కు వెళ్లినప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఫ్లెక్లిబిలిటీ, మొబిలిటీ మీద. అప్పుడే బరువులు ఎత్తినప్పుడు, రన్నింగ్‌లాంటివి చేసినప్పుడు గాయాలు కాకుండా ఉంటాయని’ అంటుంది.

  • అనన్యా వర్కవుట్‌లో యోగా తరువాత ప్రధానమైనవి పిలెట్స్‌. ఇది మంచి స్ర్టెచింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌. బిగుసుకున్న కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.

  • ఎప్పటికప్పుడు కొత్త వర్కవుట్స్‌తో తనకు తాను సవాలు విసురుకొంటుంది అనన్యా. ఇంట్లో రోజూ హఠ, విన్యాస యోగా సాధన చేస్తుంది. ఒకవేళ మరింత కఠినంగా ఉండాలనుకొంటే ఏరియల్‌ యోగా... అంటే తలకిందులగా వేలాడుతూ వేసే ఆసనం. జిమ్‌లో రొటీన్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ల వల్ల కీళ్లు, వెన్నెముకలపై పడే ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

ఇదీ మెనూ...

అనన్యాకు బాగా ఇష్టమైన ఫుడ్‌ బర్గర్లు. ప్రతి ఆదివారం ఆమెకు ‘బర్గర్‌ డే’. కావల్సినన్ని లాగించేస్తుంది. ‘నచ్చింది తింటాను. వారానికి ఒకసారి పొట్ట శుభ్రం చేసుకొంటాను. ఏదో ఒక డైట్‌ ప్లాన్‌ తీసుకొని... దాన్నే అనుసరిస్తూ వెళ్లడం నాకు నచ్చదు. దానిమీద దృష్టి పెట్టే కంటే... రోగనిరోధకశక్తినిచ్చే ఆహారం తీసుకోవడం పైనే శ్రద్ధ పెడతాను’ అంటుంది అనన్యా. ఉదయం యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌తో మొదలువుతుంది. ఆ తరువాత తీసుకొనే మెనూలో కూడా పసుపు, పండ్లు, విటమిన్‌-సి గల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకొంటుంది.

ఉదయం: బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్‌, బటర్‌తో బ్రెడ్‌ టోస్ట్‌, బ్లాక్‌ కాఫీ

మధ్యాహ్నం: లంచ్‌కు ఉడకబెట్టిన కూరగాయ ముక్కలతో చికెన్‌ శాండ్‌విచ్‌

సాయంత్రం: స్నాక్స్‌ సమయంలో నట్స్‌, కప్పు బ్లాక్‌ కాఫీ

రాత్రి: డిన్నర్‌లో గ్రిల్డ్‌ ఫిష్‌ లేదా చికెన్‌, సూప్‌

‘ఎంత బిజీగా ఉన్నా నేను కడుపు నిండా తింటాను. అదనపు క్యాలరీలు కరిగేదాకా వ్యాయామం చేస్తాను. కంటి నిండా నిద్రపోతాను. అంతేకానీ వేరొకరిని చూసి... వారిలా నేనూ గంటలతరబడి జిమ్‌లో గడపాలని అనుకోను. ఇంకెవరితోనూ పోల్చుకొని నాజూగ్గా ఉండేందుకు కడుపు మాడ్చుకోను. నా శరీరం, నా లుక్స్‌తో నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను.’

Updated Date - 2023-12-11T00:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising