ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కళ్ల మీద ఓ కన్నేసి..

ABN, First Publish Date - 2023-12-05T04:32:50+05:30

కళ్లలో నీటి కాసులు అనే ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. కాబట్టి కుటుంబ చరిత్రలో గ్లాకోమా ఉన్న ప్రతి ఒక్కరూ గ్లాకోమా స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి.

40 ఏళ్లు దాటిన తర్వాత కంటి చూపు

మందగించడం సహజం. అయితే కొందర్లో ఇంకొన్ని కంటి సమస్యలు కూడా తోడయ్యే అవకాశాలుంటాయి. వాటిని నివారించుకుంటూ, ప్రారంభంలోనే

గుర్తించగలిగితే, కంటి చూపును కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా దగ్గరి చూపు మందగించడం మొదలు పెడుతుంది. అయితే కొందర్లో ఈ సమస్య కాస్త ముందుగా 37 ఏళ్లకే మొదలు కావచ్చు. లేదా 43 ఏళ్ల వరకూ వాయిదా పడవచ్చు. ఈ సమస్యను కళ్లజోడుతో సులువుగా సరిదిద్దవచ్చు. దీంతో పాటు కొందర్లో ఇతరత్రా కంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

గ్లాకోమా గండం

కళ్లలో నీటి కాసులు అనే ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. కాబట్టి కుటుంబ చరిత్రలో గ్లాకోమా ఉన్న ప్రతి ఒక్కరూ గ్లాకోమా స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి. ఈ సమస్య ఉన్నట్టు ఎవరికి వారు చివరి దశ వరకూ కనిపెట్టలేరు. సాఽధారణ పరీక్షల్లో లేదా కంటి చూపు తగ్గి, వైద్యులను కలిసినప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది. కాబట్టి 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, మరీ ముఖ్యంగా గ్లాకోమా కుటుంబ చరిత్ర కలిగినవాళ్లు స్ర్కీనింగ్‌ చేయించుకుంటూ ఉండాలి. ఈ సమస్యలో కంటికి జరిగిన నష్టాన్ని తిరిగి చికిత్సతో సరిదిద్దే అవకాశం ఉండదు. మున్ముందు జరగబోయే నష్టాన్ని మాత్రమే చికిత్సతో నివారించే వీలుంటుంది. చివరి దశకు చేరుకుంటే కంటి చూపు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్లాకోమాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే, జరగబోయే నష్టాన్ని నివారించడం కోసం ఐ డ్రాప్స్‌ వాడుకోవలసి ఉంటుంది. ఈ యాంటీ గ్లాకోమా మెడికేషన్‌ను జీవితాంతం వాడవలసిన ఉంటుంది. అయితే కొందరికి మందులతో ఫలితం కనిపించినప్పుడు, లేదా సర్జరీ అవసరం పడవచ్చు. చికిత్స తర్వాత ఏడాదికోసారి గ్లాకోమా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

రెటినోపతి రాకుండా...

మధుమేహం అదుపు తప్పినా, హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, రెటీనా దెబ్బ తింటుంది. రెటినోపతి అనే ఈ సమస్యలో కన్ను దెబ్బతిన్న తర్వాత, చికిత్సతో మున్ముందు మరింత నష్టం జరగకుండా నివారించవచ్చు. అంతే తప్ప జరిగిన నష్టాన్ని సరిదిద్దే వీలు ఉండదు. కాబట్టి కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవాళ్లు 40 ఏళ్ల నుంచి మధుమేహ పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. మధుమేహులు క్రమం తప్పకుండా రెటీనా పరీక్షలు చేయించుకుంటూ, చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. ఈ సమస్య కూడా దశలవారీగా ముదిరిపోతుంది. చివరి వరకూ సమస్య తీవ్రతను తెలుసుకునే వీలుండదు కాబట్టి, ముందు జాగ్రత్తతో వ్యవహరించడం అవసరం. రెటినోపతికి గురైన వాళ్లకు రెటీనల్‌ లేజర్స్‌, కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరపడతాయి. కొన్ని సందర్భాల్లో నీరు చేరి, మాక్యులర్‌ ఎడీమాకు గురి కావచ్చు. ఇలాంటిప్పుడు ఇంజెక్షన్లు అవసరపడతాయి. అయితే చికిత్స తర్వాత మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం అత్యవసరం.

క్యాటర్యాక్ట్‌ కష్టాలు

పెరిగే వయసును ఎలా అడ్డుకోలేమో, కంటి శుక్లాలను కూడా అలాగే అడ్డుకోలేం. కళ్లలోని లెన్స్‌ మసకబారడంతో చూపు మందగించే సమస్య ఇది. ఈ సమస్యకు మైనర్‌ సర్జరీ ఒక్కటే పరిష్కారం. సర్జరీలో భాగంగా మసకబారిన సహజసిద్ధ లెన్స్‌న శుభ్రం చేసి, అదే ప్రదేశంలో ఇంకొక లెన్స్‌ను అమర్చడం జరుగుతుంది. పూర్వం క్యాటరాక్ట్‌ ముదిరే వరకూ ఆగి, ఆ తర్వాతే సర్జరీ చేసేవారు. కానీ నేడు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, వైద్యులు, లేజర్‌తో ప్రారంభ దశల్లోనే శుక్లాల సమస్యను పరిష్కరించగలుగుతున్నారు. ఇలా ప్రారంభంలోనే చికిత్స తీసుకోవడం వల్ల దృష్టి నాణ్యత పెరుగుతుంది. ఆధునిక చికిత్సతో సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడమే కాకుండా, నాలుగో రోజు నుంచి అన్ని పనులూ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కళ్లజోడును ఇష్టపడని వాళ్లు, సర్జరీ సమయంలోనే అవసరమైన లెన్స్‌ను అమర్చుకునే వెసులుబాటు కూడా ఉంది.

ముంచుకొచ్చే ‘మాక్యులర్‌ డీజనరేషన్‌’

పెరిగే వయసు రీత్యా రెటీనాలో కొన్ని మార్పులు జరగడం వల్ల మెంబ్రేన్స్‌ ఏర్పడి, కంటిచూపు మందగిస్తుంది. ఈ మెంబ్రేన్స్‌ను కరిగించడం కోసం కొన్ని ఇంజెక్షన్లను తీసుకోవలసి ఉంటుంది. ఈ సమస్యను కూడా పరీక్షల ద్వారా ముందుగానే కనిపెట్టాలి. సమస్య ఉన్నప్పుడు, విటమిన్‌ ట్యాబ్లెట్లు తీసుకుంటే సమస్య నెమ్మదించేలా చేయవచ్చు.

అప్రమత్తతే అండదండ

అప్రమత్తంగా ఉండడం, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా గ్లాకోమా, రెటినోపతీలను ముందుగానే గుర్తించి, కంటి చూపు తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు. కుటుంబ చరిత్రలో గ్లాకోమా ఉంటే, ముందుగానే అప్రమత్తం కావాలి. 40 ఏళ్ల నుంచి గ్లాకోమా స్ర్కీనింగ్‌ చేయించుకుంటూ ఉండాలి. గ్లాకోమా నిర్థారణ అయిన తర్వాత, తీవ్రతను బట్టి ప్రతి మూడు లేదా ఆరు నెలలకూ లేదా ఏడాదికి ఒకసారి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. సమస్య ఉందని తేలితే వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. అలాగే మధుమేహులు డయాబెటాలజి్‌స్టను కలిసిన ప్రతిసారీ, కంటి డాక్టరును కూడా కలుస్తూ ఉండాలి. రాత్రివేళ వాహనాలు నడిపే సమయంలో లైట్లు స్పష్టంగా కనిపించకపోయినా, కళ్లు మండడం, నీరు కారడం లాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే క్యాటర్యాక్ట్‌గా పరిగణించి వైద్యులను కలవాలి. ప్రారంభంలో కంటి చుక్కలతో సమస్యను అదుపు చేయవచ్చు. తీవ్రత పెరిగితే సర్జరీ చేయించుకోవచ్చు.

Updated Date - 2023-12-05T04:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising