ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salaar : ఆ మూడు సినిమాల కలయిక సలార్‌?

ABN, First Publish Date - 2023-12-03T01:41:43+05:30

ప్రభాస్‌ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ‘సలార్‌’ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. మూడున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌ మిశ్రమ స్పందన తీసుకొచ్చింది.

ప్రభాస్‌ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ‘సలార్‌’ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. మూడున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌ మిశ్రమ స్పందన తీసుకొచ్చింది. ట్రైలర్‌ అచ్చంగా ‘కేజీఎ్‌ఫ’లానే ఉందని, ఆ కథని ‘సలార్‌’లో పొడిగించారన్న పెదవి విరుపు మాటలు వినిపిస్తున్నాయి. టేకింగ్‌, మేకింగ్‌, క్యారెక్టరైజేషన్స్‌, డైలాగ్‌ మాడ్యులేషన్స్‌లో ‘కేజీఎఫ్‌’ ఛాయలు స్పష్టం. అయితే ‘కేజీఎఫ్‌’తో పాటుగా మరో రెండు సినిమాల్నీ అభిమానులు గుర్తు చేసుకొంటున్నారు. చిరంజీవి పాత సినిమా ‘కిరాతకుడు’ ఛాయలు ‘సలార్‌’లో ఉన్నాయి. ‘సలార్‌’లోలానే ‘కితాతకుడు’ కూడా ఓ నేర సామ్రాజ్యం చుట్టూ సాగే కథే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘ఉగ్రం’ సినిమాలోనూ ఇలాంటి కథే ఉంటుంది. ‘ఉగ్రం’లో ఇద్దరి స్నేహితుల అనుబంధం, ప్రయాణం, వాళ్ల శత్రుత్వం చూపించాడు ప్రశాంత్‌ నీల్‌. ఆ సినిమా సూపర్‌ హిట్టయ్యింది. ‘ఉగ్రం’కి కొనసాగింపుగా ‘సలార్‌’ వస్తోందని చాలా కాలం కిత్రం నుంచే ప్రచారం జరుగుతోంది. ‘సలార్‌’ చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. డిసెంబరు 22న ‘సలార్‌’ సినిమా బయటకు వస్తే కానీ, అసలు ఈ సినిమా దేనికి కాపీ, లేదంటే దేనికి స్ఫూర్తి అనేది తెలీదు. ‘సలార్‌’ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. పార్ట్‌ 2 వచ్చే యేడాది విడుదల కానుంది.

Updated Date - 2023-12-03T01:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising