ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం మాట్లాడుతున్నారు.. వారితో మీకు పోలికా?

ABN, First Publish Date - 2023-03-09T11:36:33+05:30

మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి(Jayalalithaa, Karunanidhi) లాగే తాను కూడా ఓ పార్టీకి అధ్యక్షుడినంటూ బీజేపీ నేత అన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి(Jayalalithaa, Karunanidhi) లాగే తాను కూడా ఓ పార్టీకి అధ్యక్షుడినంటూ బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకేకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) స్పందించారు. జయతో అన్నామలైకి పోలికేంటని ప్రశ్నించారు. ఆయన బీజేపీకి అధ్యక్షుడు ఎలా అయ్యాడో తాను చెప్పదలచుకోలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ జయలాంటి నాయకురాలు మరొకరు జన్మించబోరన్నారు. బుధవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. పలువురు బీజేపీ నేతలు అన్నాడీఎంకేలో చేరడంపై స్పందిస్తూ.. అన్నాడీఎంకే మహాసముద్రమని, ఇందులో ఎవరైనా కలవవచ్చని వ్యాఖ్యానించారు. రాయి వేస్తే పగిలిపోయేందుకు అన్నాడీఎంకే అద్దం కాదన్నారు. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే(AIADMK) బలోపేతమవుతుండడం పలువురు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ఆమోదించే రాజకీయ పరిపక్వత రాజకీయ పార్టీల నేతలకు ఉండాలని, అన్నామలైకి కూడా అలాంటిది చాలా అవసరమని ఎద్దేవా చేశారు. ఎడప్పాడి పళనిస్వామి దిష్టిబొమ్మలను దహనం చేసే బీజేపీ కార్యకర్తలను అన్నామలై నియంత్రించాలన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న కోటిన్నరమంది కార్యకర్తలు కూడా ఆగ్రహిస్తే ఏమవుతుందో అన్నామలై గ్రహిస్తే మంచిదన్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కొనసాగుతుందని పళనిస్వామి, అన్నామలై ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేస్తూ.. కూటమి ధర్మాన్ని అన్ని పార్టీలు పాటించాలని జయకుమార్‌ సూచించారు.

Updated Date - 2023-03-09T11:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising