ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal: పశ్చిమబెంగాల్‌లో తాజా అల్లర్లు, రాళ్లురువ్విన స్థానికులపై లాఠీచార్జి

ABN, First Publish Date - 2023-04-22T19:27:12+05:30

పశ్చిమబెంగాల్‌లోని కలియాగంజ్ టౌన్ ఉత్తర్ దినజ్‌పూర్ ప్రాంతంలో శనివారంనాడు తాజా అల్లర్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) కలియాగంజ్ టౌన్ ఉత్తర్ దినజ్‌పూర్ (Uttar Dinajpur) ప్రాంతంలో శనివారంనాడు తాజా అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటన ఉద్రిక్తతలకు కారణమైంది. మైనర్ బాలిక మృతదేహం శుక్రవారంనాడు వెలుగుచూడటంతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా స్థానికులు శనివారం ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఇందుకు ప్రతిగా స్థానికులు రాళ్ల రువ్వారు.

కాగా, బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఇతన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆ పార్టీ నేత భారతి ఘోష్ మండిపడ్డారు. ''ఒక నేరం జరిగినప్పుడు అనుసరించాల్సిన అన్ని నియమ నిబంధలను పోలీసులు అతిక్రమించారు. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు అమానవీయంగా ఊడ్చుకుంటూ తీసికెళ్లారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు, సాక్ష్యాలను ధ్వంసం చేసి, అపరాధులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి' అని భారతి ఘోష్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ మరో ట్వీట్‌లో మమతా బెనర్జీ సర్కార్‌పై మండిపడ్డారు. మమతా బెనర్జీ తన పదవికి న్యాయం చేయలేకపోయారని, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని, మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, మృతురాలి కుటుుంబాన్ని తాము కలుసుకుంటామని, అధికారులతోనూ, పోస్ట్‌మార్టం జరిపిన వైద్యులతోనూ మాట్లాడి నివేదక సిద్ధం చేయిస్తామని ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనన్గో చెప్పారు. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఘటనల్లో చాలా సున్నితంగా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. బాలిక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లడం అత్యంత దయనీయమని వాపోయారు. కాగా, మైనర్ బాలిక మృతదేహాన్ని ఈడ్డుకుంటూ వెళ్లిన వీడియో బయటకు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది.

Updated Date - 2023-04-22T19:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising