విజయ్‌దివస్.. అమర వీరులకు మోదీ, ముర్ము ఘన నివాళి
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:41 AM
భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1971లో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులైన జవానులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. నాటి జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. బంగ్లాదేశ్ విమోచన కోసం జరిపిన ఆ నాటి యుద్ధంలో భారత్ ఘన
న్యూడిల్లీ, డిసెంబరు 16: భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1971లో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులైన జవానులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. నాటి జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. బంగ్లాదేశ్ విమోచన కోసం జరిపిన ఆ నాటి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 90 వేల మందికిపైగా పాకిస్థాన్ సైనికులు 1971, డిసెంబరు 16న లొంగిపోయారు. అదేరోజు బంగ్లాదేశ్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం లభించి.. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భారత్ సాధించిన ఈ విజయంతో దక్షిణాసియా ముఖచిత్రం కూడా మారిపోయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబరు 16న ‘విజయ దివ్‌స’ను నిర్వహిస్తున్నారు. విజయ్ దివ్‌సను పురస్కరించుకుని ఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం(బీఎ్‌సఎఫ్) సిబ్బంది తొలిసారి పెరేడ్ నిర్వహించారు.
Updated Date - Dec 17 , 2023 | 06:44 AM