ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Savarkar in UP Syllabus: యూపీ బోర్డ్ సిలబస్‌లో సావర్కర్‌ సహా 50 మంది ప్రముఖులు

ABN, First Publish Date - 2023-06-23T15:37:35+05:30

ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ 2023-24 విద్యాసంవత్సరానికి గాను 9 నుంచి 12వ తరగతి వరకూ యూపీ బోర్డ్ క్లాసెస్ పాఠ్యాంశాల్లో గణనీయమైన మార్పులు చేసింది. వినాయక్ దామోదర్ సావర్కర్ సహా 50 మంది ప్రముఖుల బయోగ్రఫీని సిలబస్‌లో చేర్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ (UPMSP) 2023-24 విద్యాసంవత్సరానికి గాను 9 నుంచి 12వ తరగతి వరకూ యూపీ బోర్డ్ క్లాసెస్ పాఠ్యాంశాల్లో (UP Board Syllabus) గణనీయమైన మార్పులు చేసింది. వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar) సహా 50 మంది ప్రముఖుల బయోగ్రఫీని సిలబస్‌లో చేర్చింది. సవరించిన యూపీఎంఎస్‌పీ సిలబస్‌ను బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ upmsp.edu.in.లో సైతం అందుబాటులో ఉంచింది.

సావర్క్‌తో పాటు పండిట్ దయాళ్ ఉపాధ్యాయ్, మహావీర్ జైన్, భారతరత్న మహమన మదన్ మోహన్ మాలవీయ, అరవింద్ ఘోష్, రాజా రామమోహన్ రాయ్, సరోజిని నాయుడు, నానాసాహెబ్ తదితర ప్రముఖులు సవరించిన సిలబస్‌లో చోటుచేసుకున్నారు. మోరల్ స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా సబ్కెక్టులలో ఈ పాఠ్యాంశాలు చేర్చారు. వేసవి సెలవులు పూర్తయి జూలైలో స్కూళ్లు తెరవగానే ఈ పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. 9 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థులు తప్పనిసరిగా ఈ సబ్జెక్టులలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే ఈ మార్కులను మాత్రం 10, 12వ తరగితి మార్క్‌షీట్స్‌లో చేర్చరు. యూపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకూ 27 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

క్లాస్‌ల వారీగా...

9వ తరగతి: తొమ్మిదో తరగతి పాఠ్యాంశాల్లో చోటుచేసుకున్న ప్రముఖుల్లో చంద్రశేఖర్ ఆజాద్, బిర్సా ముండా, బేగం హజ్రత్ మహల్, వీర్ కున్వర్ సింగ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, గౌతమ్ బుద్ధ, జ్యోతిబ ఫులే, ఛత్రపతి శివాజీ, వినాయక్ దామోదర్ సావర్కర్, వినోభా భావే, శ్రీనివాస రామానుజన్, జగదీష్ చంద్రబోస్ ఉన్నారు.

10వ తరగతి: మంగళ్ పాండే, రోషన్ సింగ్, సుఖ్‌దేవ్, లోకమాన్య తిలక్, గోపాల కృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, ఖుదీ రామ్ బోస్, స్వామి వివేకానంద.

11వ తరగతి: రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మహావీర్ జైన్, ఎం.మదన్ మోహన్ మాలవీయ, అరవింద్ ఘోష్, రాజా రామ మోహన్ రాయ్, సరోజిని నాయుడు, నానా సాహిబ్, మహర్షి పతంజలి, సుర్‌గావ్ శుశ్రుత, డాక్టర్ హోమి జహంగీర్ భాభా.

12వ తరగతి: రామకృష్ణ పరమహంస, గణేష్ సావర్కర్ విద్యార్థి, రాజ్‌గురు, రబీంద్రనాథ్ ఠాగూర్, లాల్ బహదూర్ శాస్త్రి, రాణి లక్ష్మీభాయ్, మహారాణ ప్రతాప్, బకిం చంద్ర ఛటర్జీ, ఆది శంకరాచార్య, గురునానక్ దేవ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, రామానుజాచార్య, పాణిని, ఆర్యభట్, సీవీ రామన్.

Updated Date - 2023-06-23T15:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising