ఫిలిప్పీన్స్, జపాన్‌లలో సునామీ!
ABN, First Publish Date - 2023-12-03T03:22:59+05:30
ఫిలిప్పీన్స్, జపాన్ నైరుతి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో శనివారం రాత్రి భూకంపం సంభవించింది.
మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగసే అవకాశం
ఫిలిప్పీన్స్, యూఎస్ శాస్త్రవేత్తల హెచ్చరిక
మనీలా, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఫిలిప్పీన్స్, జపాన్ నైరుతి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో శనివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. 32 కిలోమీటర్ల మేర సంభవించిన ఈ భూకంపం వల్ల ఏ మేరకు ప్రాణ, ధన నష్టం జరిగిందన్న వివరాలేం తెలియరాలేదు. భూకంప తీవ్రతను పరిశీలించిన ఫిలిప్పైన్ సిస్మాలజీ ఏజెన్సీ, యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్.. ఫిలిప్పీన్స్, జపాన్ నైరుతి తీరాల్లో సునామీ రానుందని.. మూడు మీటర్ల మేర అలలు ఎగసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. కాగా, ఈ రెండు దేశాల్లో సునామీ తలెత్తే అవకాశమున్న నివాస ప్రాంతాలను ఖాళీ చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
Updated Date - 2023-12-03T03:22:59+05:30 IST