ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: నేడు సింగపూర్‌కు సీఎం

ABN, First Publish Date - 2023-05-23T07:45:25+05:30

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) విదేశీ పర్యటనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 9 రోజుల పాటు విదేశీ పెట్టుబడుల సమీకరణ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఆయన చెన్నై నుంచి విమానంలో సింగపూరుకు బయలుదేరి వెళుతున్నారు. రెండు రోజులపాటు ఆయన సింగపూరు(Singapore)లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 24న సింగపూరులో పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొంటారు. సింగపూరు- భారత్‌ వాణిజ్య మండలికి చెందిన సభ్యులు, బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను స్టాలిన్‌ వివరించనున్నారు. అదే సమయంలో పలు విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నారు. సింగపూరు పర్యటనను ముగించుకుని ఈ నెల 25న ఆయన జపాన్‌ రాజధాని టోక్యోకు బయలుదేరి వెళతారు. అక్కడి పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలను కలుసుకోనున్నారు. ఈ నెల 31న ఆయన తన విదేశీ పర్యటనను ముగించుకుని నగరానికి తిరిగి రానున్నారు.

Updated Date - 2023-05-23T07:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising