ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh : ప్రభుత్వం వినూత్న ఆలోచన... తేనెటీగల దండు ఏర్పాటు...

ABN, First Publish Date - 2023-01-22T11:16:22+05:30

ఏనుగుల దాడి నుంచి పంటలను రక్షించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది.

Honeybee Army
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : ఏనుగుల దాడి నుంచి పంటలను రక్షించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఏనుగులు ఇప్ప పూల మత్తులో వచ్చి పంటలను నాశనం చేస్తుండటంతో, వాటిని తరిమికొట్టేందుకు తేనెటీగల దండును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్-మధ్య ప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఏనుగులను తరిమికొట్టేందుకు చేపట్టవలసిన చర్యలను, చేయకూడని పనులను వివరిస్తూ గత వారం ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఏనుగులకు సహజంగానే తేనెటీగలంటే భయం కాబట్టి, తేనెటీగల దండును పెంచడానికి తేనెటీగల పెట్టెలను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది.

తేనెటీగలు ఏనుగుల తొండాలు, కళ్ళల్లో కుడతాయి కాబట్టి ఏనుగులకు తేనెటీగలంటే భయం. సిద్ధి, సింగ్రౌలీ, షాడోల్, అనుప్పుర్, ఉమరియా, డిండోరీ, మాండ్లా జిల్లాల్లోని గ్రామాల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల ఏనుగుల నుంచి పంటలను కాపాడుకోవడంతోపాటు స్థానికులకు జీవనోపాధి కూడా దొరుకుతుందని పేర్కొంది.

Updated Date - 2023-01-22T11:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising