ఎంపీల సస్పెన్షన్ ముందస్తు ప్రణాళికే!
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:49 AM
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి, పార్లమెంటరీ ప్రక్రియను ధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఒక అస్త్రంగా చేసుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆక్షేపించారు. పార్లమెంటు ఉభయసభల నుంచి 146 మంది ఎంపీలను
ఉపరాష్ట్రపతికి పంపిన లేఖలో ఖర్గే ఆరోపణ
న్యూఢిల్లీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి, పార్లమెంటరీ ప్రక్రియను ధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఒక అస్త్రంగా చేసుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆక్షేపించారు. పార్లమెంటు ఉభయసభల నుంచి 146 మంది ఎంపీలను ముందస్తు ప్రణాళికలో భాగంగానే సామూహికంగా సస్పెండ్ చేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటుకు హాజరుకాని ఎంపీని సైతం సస్పెండ్ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. వారందరినీ సస్పెండ్ చేయడం ద్వారా చైనాతో సరిహద్దు గొడవలు, మణిపూర్ అల్లర్లు, పార్లమెంటులో భద్రతా వైఫల్యం తదితర అంశాలపై పార్లమెంటులో చర్చ నుంచి ప్రభుత్వం తప్పించుకుందని ఆరోపించారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు, ఎంపీల సస్పెన్షన్‌పై చర్చించేందుకు సోమవారం తన ఇంటికి రావాలని ఖర్గేకు జగదీప్ ధన్‌ఖడ్ శనివారం రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఖర్గే ఉపరాష్ట్రపతికి సోమవారం రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. తాను ఢిల్లీలో లేనని, వచ్చాక కలుస్తానని పేర్కొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:49 AM