Surat Diamond Bourse : ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:50 AM
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్(ఎ్‌సడీబీ) భవన సముదాయాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ‘‘సూరత్ నగర కీర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. అది అలాంటి ఇలాంటి చిన్న వజ్రం కాదు. ప్రపంచంలోనే అతిపెద్దది. గొప్ప గొప్ప
ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కన్నా పెద్దది!
67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్‌డీబీ నిర్మాణం
వ్యాపారుల కోసం 9 టవర్లలో 4,500 ఆఫీసుల ఏర్పాటు
సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని
1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి
రూ.3,200 కోట్లు ఎస్‌డీబీ నిర్మాణ వ్యయం
సూరత్, డిసెంబరు 17: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్(ఎ్‌సడీబీ) భవన సముదాయాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ‘‘సూరత్ నగర కీర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. అది అలాంటి ఇలాంటి చిన్న వజ్రం కాదు. ప్రపంచంలోనే అతిపెద్దది. గొప్ప గొప్ప భవనాలు కూడా ఈ వజ్రపు కాంతుల ముందు తేలిపోతాయి’’ అని వ్యాఖ్యానించారు. సూరత్ కేంద్రంగా ఉన్న వజ్రాల పరిశ్రమ 8లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. ఎస్‌డీబీతో మరో 1.5లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎస్‌డీబీ భవన సముదాయం నవభారత శక్తికి, సంకల్పానికి చిహ్నమని అభివర్ణించారు. తాను మూడోసారి ప్రధాని అయితే భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతానని పునరుద్ఘాటించారు. కాగా, ప్రభుత్వ, ప్రైవేటు.. ఎలా చూసినా విస్తీర్ణం పరంగా ఎస్‌డీబీనే ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయంగా రికార్డు సాధించిందని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పేరు మీద ఉండేది. పెంటగాన్ విస్తీర్ణం 66.73లక్షల చదరపు అడుగులు. ఇదిలా ఉండగా, ఆదివారమే సూరత్ ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు.
ఎస్‌డీబీని సూరత్ నగరం సమీపంలోని ఖాజోడ్ గ్రామంలో 67లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో తొమ్మిది టవర్లు, ఒక్కో టవర్‌లో 15 అంతస్తులున్నాయి. వజ్రాల వ్యాపారుల కోసం 4,500 ఆఫీసులను ఏర్పాటు చేశారు.
వజ్రాలపై పరిశోధన, వ్యాపార నగరం (డైమండ్ రిసెర్చ్ అండ్ మర్కంటైల్-డ్రీమ్‌సిటీ)లో భాగంగా 35.54 ఎకరాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనికి 2015 ఫిబ్రవరిలో నాటి గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ దీనికి భూమిపూజ చేశారు. నిర్మాణానికి రూ.3,200 కోట్లు ఖర్చు అయింది.
Updated Date - Dec 18 , 2023 | 03:54 AM