ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహిళపై రేప్‌ కేసు పెట్టొచ్చా.. సుప్రీం పరిశీలన

ABN, First Publish Date - 2023-12-03T02:24:08+05:30

మహిళపై మరో మహిళ అత్యాచారం కేసు పెట్టవచ్చా? ఈ సమస్యను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈలోగా నిందితురాలిని ..

న్యూఢిల్లీ, డిసెంబరు 2: మహిళపై మరో మహిళ అత్యాచారం కేసు పెట్టవచ్చా? ఈ సమస్యను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈలోగా నిందితురాలిని అరెస్టు చేయకూడదంటూ ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సమస్యపై నాలుగు వారాల్లో వైఖరి చెప్పాలంటూ పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. 61 ఏళ్ల విఽతంతువుపై ఆమె పెద్ద కోడలే అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేయడం గమనార్హం. నిందితురాలి తరఫు న్యాయాది రిషి మల్హోత్రా వాదనలు వినిపిస్తూ మహిళపై అత్యాచారం కేసు పెట్టకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కేసులో పేర్కొన్న వివరాలు ప్రకారం.. నిందితురాలైన వితంతువు పెద్ద కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. బాధితురాలికి, అతడికి వర్చువల్‌ విధానంలో వివాహమైంది. పెళ్లి తరువాత ఆమె అత్తవారింట్లోనే ఉంటోంది. ఇంతలో నిందితురాలి చిన్న కుమారుడు పోర్చుగల్‌ నుంచి వచ్చి కొద్దిరోజుల తర్వాత వెళ్లిపోయాడు. ఆ తర్వాత కుటుంబంలో ఘర్షణలు అధికమయ్యాయి. దీంతో, కోడలుకు రూ.11 లక్షలు ఇచ్చి, వివాహాన్ని రద్దు చేయడానికి అత్త అంగీకరించింది. అయితే, అత్త, మరిది తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2023-12-03T02:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising