ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

700 మెగావాట్ల అణువిద్యుదుత్పత్తి దిశగా అడుగు

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:36 AM

గుజరాత్‌లోని కక్రాపర్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో వాణిజ్య అవసరాల కోసం 700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించే దిశగా తొలి అడుగు పడింది. తొలిదశ ప్రక్రియలో భాగంగా కంట్రోల్డ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు17: గుజరాత్‌లోని కక్రాపర్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో వాణిజ్య అవసరాల కోసం 700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించే దిశగా తొలి అడుగు పడింది. తొలిదశ ప్రక్రియలో భాగంగా కంట్రోల్డ్‌ ఫిషన్‌ రియాక్షన్‌ వ్యవస్థను శనివారం అర్ధరాత్రి ప్రారంభించారు. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ బీసీ పాఠక్‌ సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తిచేశారు. దేశంలో 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 16 స్వదేశీ ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్ల (పీహెచ్‌డబ్ల్యూఆర్‌) శ్రేణిలో కక్రాపర్‌ అటామిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేఏపీపీ) యూనిట్‌-4 రెండోది. కాగా, కక్రాపర్‌లోని యూనిట్‌-3 కార్యకాలాపాలు ప్రారంభమైన ఆరు నెలల్లోపే కేఏపీపీ-4 తొలి దశను సాధించడం విశేషమని పాఠక్‌ అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising