ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

State Chief Electoral Officer: ఉప ఎన్నిక ఆపాలని ఫిర్యాదుల్లేవు..

ABN, First Publish Date - 2023-02-21T09:33:26+05:30

ఈరోడ్‌ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిలిపివేయాలంటూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(The chie

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు

పెరంబూర్‌(చెన్నై): ఈరోడ్‌ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిలిపివేయాలంటూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(The chief election officer of the state is Satya Pradasahu) స్పష్టం చేశారు. స్థానిక సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని పలు పార్టీలు చేసిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించామన్నారు. వాటికి సంబంధించిన వీడియోలు పంపేందుకు సి-విజిల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకువచ్చామని, ఒక్క ఫిర్యాదు మాత్రమే అందిందన్నారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయపార్టీలకు తెలియజేశామని తెలిపారు. ఎన్నిక పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు సత్యప్రదసాహు తెలిపారు.

నమూనా పోలింగ్‌...

ఉప ఎన్నికలో వినియోగించనున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లలో 5 శాతం యంత్రాల్లో తలా 1,000 ఓట్లు పోలింగ్‌ చేసి నమూనా పోలింగ్‌ సోమవారం జరిగింది. ఉపఎన్నికలో 1,430 ఈవీఎంలకు వినియోగిస్తుండగా, వాటిలో పోటీచేసే అభ్యర్థులు, చిహ్నాలు పొందుపరిచే పనులు మూడవ రోజైన సోమవారం కొనసాగాయి. అభ్యర్థుల పేర్లు, చిహ్నాలు పొందుపరిచిన ఈవీఎంలలో ఎన్నికల అధికారి శివకుమార్‌ నేతృత్వంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నమూనా పో లింగ్‌ నిర్వహించారు. ఈవీఎంలో ఓట్ల నమోదులో ఎలాంటి లోపాలు లేవని తెలియజేయడానికే నిర్వహించినట్లు ఎన్నికల అధికారి శివకుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-02-21T09:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising