ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saturn : శనికి ఏలినాటి ‘శని’

ABN, First Publish Date - 2023-11-08T02:31:10+05:30

ఆశించినవేవీ జరగనప్పుడు, జీవితం నిరాశతో నిండిపోయినప్పుడు ఏలినాటి శని పట్టిందని ఆవేదన చెందటం చూస్తుంటాం. కానీ, ఆ శనికే శని పడితే! వినటానికి విచిత్రంగా ఉంది కదూ! సౌరకుటుంబంలో ఇతర గ్రహాలకు భిన్నంగా, చుట్టూ అందమైన ఏడు వలయాలు శని గ్రహం విశిష్టతను

ఏడేళ్లపాటు ఏడు రింగులు మాయం .. భూమికి సమాంతరంగా రావటమే కారణం

టెలిస్కోపులో కూడా కనిపించనంతటి సన్నటి రేఖగా మారనున్న వలయాలు

2025లో అదృశ్యం.. 2032లో ప్రత్యక్షం

శని గ్రహ గమనంలో మార్పులే కారణం

వాషింగ్టన్‌, నవంబరు 7: ఆశించినవేవీ జరగనప్పుడు, జీవితం నిరాశతో నిండిపోయినప్పుడు ఏలినాటి శని పట్టిందని ఆవేదన చెందటం చూస్తుంటాం. కానీ, ఆ శనికే శని పడితే! వినటానికి విచిత్రంగా ఉంది కదూ! సౌరకుటుంబంలో ఇతర గ్రహాలకు భిన్నంగా, చుట్టూ అందమైన ఏడు వలయాలు శని గ్రహం విశిష్టతను తెలుపుతుంటాయి. కానీ, ఆ వలయాలే మాయమైతే.. అవును! శని వలయాలు తాత్కాలికంగా అదృశ్యమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ ఏడేళ్లపాటు అవి మనకు కనిపించవని పేర్కొంటున్నారు. అయితే, ఇది కంటికి సంబంధించిన ఓ భ్రాంతి (ఆప్టికల్‌ ఇల్యూజన్‌) మాత్రమే కానీ నిజంగా వలయాలు లేకుండా పోవని చెబుతున్నారు. ఇంతకూ జరిగేదేమిటంటే.. భూమి నుంచి చూసినప్పుడు శని గమనంలో, కోణంలో సాపేక్షికంగా మార్పులు ఉంటాయి. ఇవి ఒక దశ దాటినప్పుడు శని వలయాలు మనకు కనిపించకుండా పోతాయి.


ప్రస్తుతం శని వంపు భూమి నుంచి చూస్తే 9 డిగ్రీల దిగువకు ఉంది. వచ్చే ఏడాది ఇది 3.7 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఆ తర్వాత సంవత్సరం అంటే 2025 నాటికి ఇది సున్నాకు పడిపోతుంది. ఆ సమయంలో శని వలయాలు భూమికి సమాంతరంగా ఒక సన్నటి రేఖలాగా ఉంటాయి. ఇంత సన్నటి రేఖను చూడటం సాధ్యం కాదు. కంటికి సమాంతరంగా ఒక కాగితాన్ని దూరంగా పెడితే ఎలాగైతే అది కనిపించదో ఆ విధంగా శని వలయాలు కూడా ఈ సమయంలో కనిపించవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే, శని వలయాల ఈ ‘అజ్ఞాతవాసం’ ఎంతోకాలం కొనసాగదు. శని గమనంలో మార్పులతో ఆ గ్రహం వంపు కోణంలో కూడా మార్పులు వస్తుంటాయి. 2032 నాటికి తిరిగి 27 డిగ్రీల వంపునకు చేరుకున్నప్పుడు.. భూమి నుంచి చూసే వారికి శని వలయాలు మళ్లీ కనువిందు చేస్తాయి. శని వలయాలు చివరిసారిగా 2009 సెప్టెంబరులో ‘అదృశ్యం’ అయ్యాయి. సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేయటానికి శనికి 29 ఏళ్ల 6 నెలలు పడుతుంది. ఈ సమయంలో శని వలయాలు సూర్యుడితో సాపేక్షికంగా 27.3 డిగ్రీల కోణం వరకూ మారుతాయి.

30 కోట్ల ఏళ్లలో శాశ్వతంగా కనుమరుగు

శని చుట్టూ ఏడు వలయాలున్నాయి. శక్తిమంతమైన శని గురుత్వాకర్షణశక్తికి ఆకర్షించబడి ముక్కలు ముక్కలైన గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉపగ్రహాల శకలాలే ఈ వలయాలని శాస్త్రవేత్తల అంచనా. మంచు, రాళ్లు, ధూళితో ఇవి కూడి ఉంటాయని భావిస్తున్నారు. శని వలయాలు శాశ్వతం కావని, ఇప్పటికే వాటిలో పెద్ద పెద్ద భాగాలు శని గ్రహంలో కలిసిపోతున్నాయని, మరో 30 కోట్ల ఏళ్లలో వలయాలు పూర్తిగా కనుమరుగవుతాయని చెబుతున్నారు.

Updated Date - 2023-11-08T10:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising