ప్రజల సొమ్మును లాక్కున్నది షహెన్‌షా సెల్ఫీపాయింట్ల కోసమా?
ABN, Publish Date - Dec 31 , 2023 | 03:54 AM
రైల్వే స్టేషన్లలో మోదీ కటౌట్లతో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో హిందీలో ఒక
మోదీ కటౌట్లతో సెల్ఫీ స్టాండ్ల ఏర్పాటుపై రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ, డిసెంబరు 30: రైల్వే స్టేషన్లలో మోదీ కటౌట్లతో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో హిందీలో ఒక పోస్టు పెట్టారు. ‘పేదల రవాణా సాధనంగా పేరొందిన భారతీయ రైల్వేల్లో ప్రతీ తరగతిలో టికెట్ల ధరలను పెంచారు. గతంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీలను తొలగించారు. చివరికి ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను కూడా పెంచేశారు. రైల్వేల ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచారు. ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ విధంగా లాక్కున్నది సెల్ఫీస్టాండ్లను ఏర్పాటు చేయటానికేనా? భారతీయులు ఏం కోరుకుంటారు? తక్కువ ధరకు సిలిండర్లు.. సులువైన రైలు ప్రయాణాన్నా.. లేక షహెన్‌షా విగ్రహంతో సెల్ఫీనా?’ అని ప్రశ్నించారు.
Updated Date - Dec 31 , 2023 | 06:50 AM