Fog: ఉత్తర భారతాన్ని చుట్టుముట్టిన పొగమంచు.. రైళ్లు, విమానాలు రద్దు
ABN, Publish Date - Dec 29 , 2023 | 10:38 AM
చలికాలం పైగా వాయు కాలుష్యం దీంతో ఉత్తర భారతదేశం పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇవాళ ఉదయాన్నే దేశంలోని చాలా ప్రాంతాలు మంచుదుప్పటిని కప్పుకున్నాయి.
ఢిల్లీ: చలికాలం పైగా వాయు కాలుష్యం దీంతో ఉత్తర భారతదేశం పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇవాళ ఉదయాన్నే దేశంలోని చాలా ప్రాంతాలు మంచుదుప్పటిని కప్పుకున్నాయి. దీని ప్రభావంతో డజన్లకు పైగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని రద్దు అయ్యాయి. జనవరి 2 వరకు ఉత్తర భారత రాష్ట్రాలలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. చలిసైతం అలాగే వణికిస్తుందని తెలిపింది.
ఇవాళ పంజాబ్, హరియాణా, ఢిల్లీలో పొగమంచు కారణంగా రెడ్ అలర్ట్, శనివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. డిసెంబర్ 31న పంజాబ్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. జనవరి 2 వరకు పలు రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ జారీ అయింది. దట్టమైన పొగమంచు పరిస్థితులు రవాణా సేవలపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఢిల్లీ-హౌరా మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా డజన్ల కొద్దీ రైళ్లు 10 - 12 గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమాన కార్యకలాపాలు కూడా పొగమంచుతో ప్రభావితమయ్యాయి. నోయిడాలో రానున్న రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్దరాత్రి దాదాపు విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది.
రోడ్డు ప్రమాదాలు..
మంచుదుప్పటి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 మంి మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - Dec 29 , 2023 | 10:38 AM