Schools: 8 వరకు పాఠశాలలకు సెలవులు
ABN, First Publish Date - 2023-09-27T08:38:00+05:30
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో(Government and aided schools) 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు త్రైమాసిక సెలవులు అక్టోబరు
పెరంబూర్(చెన్నై): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో(Government and aided schools) 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు త్రైమాసిక సెలవులు అక్టోబరు 8వ తేది వరకు పొడిగించారు. తొలుత ఈ నెల 28 నుంచి అక్టోబరు 2వ తేది వరకు ఐదు రోజులు మాత్రమే సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, ఉపాధ్యాయులకు రెండో సెమిస్టర్‌పై శిక్షణ జరుగుతుండడంతో సెలవు మరో ఆరు రోజులు పొడిగించారు. అదే సమయంలో, 6 నుంచి 8వ తరగతి వరకు ఇదివరకే ప్రకటించిన విధంగా సెలవుల అనంతరం అక్టోబరు 3వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
Updated Date - 2023-09-27T08:38:00+05:30 IST