ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామీణ రోడ్లు గుల్ల.. అత్యంత నాసిరకం

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:00 AM

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎ్‌సవై) కింద దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన రహదారులు అత్యంత నాసిరకంగా ఉన్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం తెలిపింది. పీఎంజీఎ్‌సవై అమలుపై మరింత పట్టు బిగించాలని సిఫారసు చేసింది. నాణ్యతను

గ్రామీణ సడక్‌ యోజనపై పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదిక

న్యూఢిల్లీ, డిసెంబరు 25: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎ్‌సవై) కింద దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన రహదారులు అత్యంత నాసిరకంగా ఉన్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం తెలిపింది. పీఎంజీఎ్‌సవై అమలుపై మరింత పట్టు బిగించాలని సిఫారసు చేసింది. నాణ్యతను పరిశీలించే యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించిందన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణను స్థాయీ సంఘం తోసిపుచ్చింది. గ్రామీణ రహదారుల నిర్మాణంపై మరింత పర్యవేక్షణ ఉంచాలని సూచించింది. ఈ మేరకు ఏటీఆర్‌ నివేదికను గత వారం పార్లమెంటుకు సమర్పించింది. స్థాయీ సంఘం సభ్యులు మొత్తం 2 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను పరిశీలించి, అనేక లోపాలను గుర్తించారు. కాగా, గ్రామీణ సడక్‌ యోజన ప్రారంభమైన తర్వాత దేశంలో ఇప్పటి వరకు 7 లక్షల కిలో మీటర్ల మేరకు రహదారులు నిర్మించారు.

Updated Date - Dec 26 , 2023 | 06:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising