మెరీనా తీరంలో గాంధీ విగ్రహం తొలగింపు
ABN, First Publish Date - 2023-03-04T12:04:39+05:30
మెట్రోరైలు(Metro Rail) పనుల కారణంగా స్థానిక మెరీనా సముద్రతీరంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని
ఐసిఎఫ్(చెన్నై): మెట్రోరైలు(Metro Rail) పనుల కారణంగా స్థానిక మెరీనా సముద్రతీరంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని 20 మీటర్ల దూరానికి మార్చారు. చెన్నైలో రెండవ విడత మెట్రోరైలు(Metro Rail) పనులు మూడు మార్గాల్లో జరుగుతున్న విషయం తెలి సిందే. వీటిలో లైట్‌హౌస్ నుంచి పూందమల్లి వరకు 26.1 కి.మీ దూరం నిర్మిస్తున్న మెట్రో మార్గంలో 23 స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో, మెరీనా తీరంలో గాంధీ విగ్రహం నుంచి క్వీన్ మేరీస్(Queen Mary's) కళాశాల వరకు పనులు జరుగనుండడంతో అంతరాయం ఉన్న వాటిని తొలగిస్తున్నారు. దీంతో, అక్కడ 62 ఏళ్లుగా ఉన్న గాంధీ విగ్రహాన్ని 20 మీటర్ల దూరం జరిపారు. పనులు పూర్తికాగానే యఽథా స్థలంలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Updated Date - 2023-03-04T12:04:39+05:30 IST